ఈ వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిజీ బిజీ గా గడిపారు. పరిపాలన తో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా కీలక సూచనలు కూడా చేసారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అనే దాని మీద ఆయన వైసీపీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. అదే విధంగా బుధవారం వైసీపీ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న అభ్యర్ధులను ఆయన ప్రకటించారు. నలుగురు రాజ్యసభ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసారు. వాటిపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నా నమ్మకస్తులకు ఆయన సీట్లు ఇచ్చారు. 

 

స్కూల్ విద్యపై ఆయన సమీక్ష నిర్వహించారు, జగనన్న విద్యా కానుక కింద ఇవ్వనున్న ఆరు రకాల వస్తువులను వచ్చే విద్యా సంవత్సరం నాటికి పంపిణి చెయ్యాలని ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రహమాన్ సహా పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే విధంగా కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం కి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కరోనా వైరస్ కి సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చారు జగన్. 

 

జర్మన్ కాన్సులేట్ అధికారులను జగన్ తన క్యాంప్ కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా వారితో దాదాపు గంట పాటు చర్చలు జరిపారు జగన్. అలాగే కెనడా కాన్సుల్ జనరల్ తో కూడా ఆయన భేటీ అయ్యారు. వైసీపీ పదవ ఆవిర్భావ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన మార్గాలను ఆయన సూచించారు. అలాగే పార్టీ పదవ ఏట అడుగు పెట్టిన నేపధ్యంలో ఆయన భావోద్వేగ పోస్ట్ చేసారు సోషల్ మీడియాలో.

మరింత సమాచారం తెలుసుకోండి: