కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారసులకు విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా లోకేష్ తనను తాను గొప్ప నేతగా ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ముందు ముందు రాజకీయాల్లో ఏ విధంగా రాణించాలని విషయంపై వారంతా కలిసి చర్చించారు. అయితే ఆ విందులో లోకేష్ కంటే ఆయన భార్య నారా బ్రాహ్మణి బాగా హైలెట్ అయిన సంగతి తెలిసింది. అయితే ఆ విందు తర్వాత తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తులు చెలరేగాయి. కేవలం వారసుల నాయకులు మాత్రమే మీకు కనిపించారా ? పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వారు మీకు అవసరం లేదా ? అంటూ లోకేష్, చంద్రబాబు పై తీవ్రస్థాయిలో సొంత పార్టీ నాయకులు విమర్శలు చేశారు.

IHG


 ఇక ఈ సంగతి అలా ఉంచితే రాష్ట్ర తెలుగు యువత అధ్యక్ష పదవి కోసం కొద్దిరోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. మొన్నటి వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా విజయవాడ కు చెందిన దేవినేని అవినాష్ ఉన్నారు. అయితే ఆయన కొద్ది రోజుల క్రితం టిడిపికి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయన పార్టీని వీడి నాలుగు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు తెలుగు యువత అధ్యక్షుడి నియామకం జరగలేదు. ఈ మేరకు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు పరిటాల శ్రీరామ్, ఆదిరెడ్డి వాసు ఇలా చాలా మంది పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ లిస్టులో ఎక్కువగా ఆదిరెడ్డి వాసు పేరు హైలెట్ అవ్వడంతో ఆయనకు పదవి దక్కుతుందని అందరూ అంచనా వేయగా, ఆయన బంధువు అయిన మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉండడంతో వాసు పేరు పక్కన పెట్టారట. 

IHG


పోనీ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు పేరు పారిశీలనలోకి రాగా ఆయన అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. ఇక పరిటాల శ్రీరామ్ ఫోన్ లో ఎవరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాదు అని పేరు ఉండటంతో ఆయన పేరును కూడా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా వారసులకు ఏదైనా పదవులు ఇద్దామంటే ఏదో ఒక అడ్డంకులు ఏర్పడుతున్నాయి.ఇదే సమయంలో కేవలం నాయకుల వారసులే తెలుగు యువత అధ్యక్షులు అవుతారా అంటూ తెలుగుదేశం పార్టీలో కొత్త చర్చ మొదలవడంతో ఇక వారసుల్లో ఎవరికీ తెలుగు యువత అధ్యక్షుడు ఇవ్వకూడదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గా ఉన్న నాదెళ్ల బ్రహ్మం చౌదరి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: