ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ఎఫెవ్ట్  వల్ల ఎన్నో నష్టాలు కూడా జరిగి పోతున్నాయి. భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఏకంగా కరోనా  ఎఫెక్ట్ తో  ఇటీవల దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న  ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. అంతే కాదు ఎన్నో  క్రికెట్ మ్యాచ్ లు కూడా రద్దు అవుతున్నాయి. ఇక సినిమాలపై కూడా ఈ కరోనా  ఎఫెక్ట్ పడుతుంది. ఎన్నో సినిమా షూటింగు లు  ఇప్పటికే ఆగిపోయాయి. 

 

 

 అంతే కాకుండా... పలు రాష్ట్రాలు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు అన్ని పూర్తిగా మూతపడ్డాయి, ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతున్నప్పటికీ... అందరూ సహకరించగా తప్పడం లేదు. కరోనా  వ్యాప్తిని నియంత్రించేందుకు అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ కరోనా  వైరస్ ఏకంగా మాజీ ముఖ్యమంత్రి పై కూడా పడింది. చివరికి కరోనా  ఎఫెక్ట్ తో తన కుమారుడి వివాహానికి కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రామ నగర  జానదలోకా   వద్ద భారీ ఏర్పాట్లు జరగాల్సిన నిఖిల్ రేవతి వివాహం రద్దు  అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దంపతులు రామనగర్ లో కుమారుడి వివాహం చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

 

 

 దీనికోసం భారీ ఖర్చుతో ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. కానీ ఇంతలో రాష్ట్రాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో తమ కుమారుడి వివాహం చేయాలా వద్దా అనే దానిపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అయోమయం లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వివాహ ఏర్పాట్లు అన్నింటినీ నిలిపివేశారు. దీంతో వివాహం వాయిదా పడడం ఖాయం అని తెలుస్తోంది. అయితే లక్షల మంది మధ్య అంగరంగ వైభవంగా కుమారుడి వివాహం చేయాలని భావించారు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. ఇక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వివాహం అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి... కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వివాహం జరపడం సరైనది కాదు అని అనుకుంటున్నట్లు సమాచారం, దీనికి సంబంధించి కుమారస్వామి రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: