మధ్యప్రదేష్  ప్రభుత్వంలో ప్రస్తుతం సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్ లో  సీనియర్ నేత గా కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  చెప్పి బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకోవడం తో మహారాష్ట్ర లో సంచలనం గా మారిపోయింది. అయితే జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వీడడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో అయోమయం నెలకొంది. ఇక జ్యోతిరాదిత్య సింధియా వెంట ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి పోవడంతో... మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి కమల్నాథ్ తమ ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

 

 

 అయితే జ్యోతిరాదిత్య తో పాటు పార్టీని వీడిన 22 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులోని రిసార్ట్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి కమల్ నాథ్ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. ఈ సందర్భంగా బెంగళూరులో రిసార్టులో ఉన్న 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్యప్రదేశ్ కు  చేర్పించడం లో చొరవ చూపాలని హోంమంత్రి అమిత్ షాను లేఖలో కోరారు మధ్య ప్రదేశ్ ముఖ్య మంత్రి కమల్ నాథ్. 22 మంది ఎమ్మెల్యేలు క్షేమంగా మధ్యప్రదేశ్ చేరుకునే టట్లు గా చూడండి... మీ అధికారాన్ని ఉపయోగించి 22 మంది ఎమ్మెల్యేలు భోపాల్ కి  చేర్చండి... ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా వారందరూ 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఈ మధ్య ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి అంటూ మధ్య ప్రదేశ్ ముఖ్య మంత్రి కమల్నాథ్ హోంమంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. 

 

 

 అయితే ఆ ఎమ్మెల్యేలను బెంగళూరు నుంచి విడుదల చేస్తే వారందరికీ రక్షణ కల్పించే బాధ్యత తమదే అంటూ  మధ్య ప్రదేశ్ ముఖ్య మంత్రి కమల్నాథ్ లేఖలో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  చెప్పగానే జ్యోతిరాదిత్య సింధియా వెంట 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. అటు వెంటనే బిజెపి ఎమ్మెల్యేలు..22 మంది  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విమానాల్లో తరలించి బెంగళూరులోని ఒక రిసార్టులో ఉంచి రాజకీయాలు చేస్తున్నారని... మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం కమల సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మధ్య ప్రదేశ్ ముఖ్య మంత్రి కమల్నాథ్ హోంమంత్రి అమిత్ షా కు రాసిన లేఖ మరింత ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై అమిత్ షా  ఎలా స్పందిస్తారు  అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: