ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కరోనా అనే పేరు వినిపిస్తుంది.  చైనాలోని పుహాన్ లో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి భయకంపితులను చేస్తుంది.  ఇప్పటికే ఐదే వేల మంద్ర ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేల మందికి ఈ కరోనా ఎఫెక్ట్ పడింది. అయితే కరోనా భారత్ లో ప్రవేశించింది.  ఇప్పటికే రెండు మరణాలు సంబవించాయి. అయితే కర్ణాటక, ఢిల్లీకి చెందినవారు.. ఇద్దరూ వృద్దులే.  కరోనా మహమ్మారిని తరిమేందుకు కేవలం జాగ్రత్తలు మాత్రమే అని.. డాక్టర్లు చెబుతున్నారు. కరోనా దూరంగా ఉంచేందుకు కొంత మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సూచనలు ఇస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో యోగా ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, తద్వారా కరోనాకు దూరంగా ఉండాలని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పిలుపునిచ్చారు. మన వేద శాస్త్రాల్లో కూడా ఎలాంటి భయంకరమైన రోగాలనైనా యోగా ద్వారా ఉపశమనం కలిగించవొచ్చు అని.. యోగా తో ఎలాంటి వ్యాధులనైనా నిర్మూలించవొచ్చని రాందేవ్ బాబా అన్నారు. 

 

ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికి వారు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.  ప్రజలకు పలు సూచనలు చేశారు. వైరస్ వ్యాపించకుండా నివారణ చర్యలు తీసుకోవాలని, ప్రయాణాల్లో శానిటైజర్లు వాడాలని సూచించారు. ఇతరుల నుంచి నాలుగైదు అడుగుల దూరంలో ఉండాలని, మాస్కులు ధరించాలని అన్నారు.  యోగా చేస్తున్న వారు ఇప్పడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నారని..  భారతీయ సంస్కృతి అయిన యోగాను విదేశాల్లో కూడా చేస్తున్నారని అంతగొప్ప యోగ సాధన మన దేశంలో పుట్టడం గర్వించదగ్గ విషయం అని ఆయన అన్నారు. 

 

పురాణాల్లో రుషులు, యోగులు ఈ యోగ చేసేవారని అందుకే ఎన్నో ఏళ్లు వారు సంపూర్ణ ఆరోగ్యంతో బతికారని అన్నారు. ప్రతి రోజూ యోగా సాధన చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని కోరారు. అయితే, ఉబ్బసం, గుండె జబ్బులు, మధుమేహంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని, కాబట్టి వారు సహజ జీవనశైలిని అనుసరించాలని కోరుతున్నట్టు చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: