సండే వ‌చ్చిందంటే చాలు పిల్ల‌లుగాని పెద్ద‌వారుగాని రోజూ తినే రొటీన్ ఫుడ్‌ని తిన‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. అందులో ఏదో ఒక కొత్త వెరైటీ తింటే బావుంటుంది అనిపిస్తుంది. ఆదివారం వ‌చ్చిందంటే నాన్‌వెజ్ ప్రియుల‌కి అది ఎలాగో కామ‌న్‌. మ‌రి వెజిటేరియ‌న్ ప్ల‌స్ నాన్‌వెజ్‌టేరియ‌న్స్‌కి క‌లిపి ఈ రోజు మ‌నం ఒక స్వీట్ గురించి ఇక్క‌డ తెలుసుకుందాం. స్వీట్స్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు చాలా త‌క్కువ మంది ఉంటారు. అందులోనూ సండే కాబ‌ట్టి ఖ‌చ్చితంగా స్వీట్ ఏద‌న్నా తింటే బావుంటుంది అనిపిస్తుంది. ఈ రోజు హెరాల్డ్ సండే స్పెష‌ల్ ఏమిటంటే... స్వీట్ వెజిట‌బుల్ బాత్... 

 

కావ‌ల‌సిన వ‌స్తువులు...కాలీఫ్ల‌వ‌ర్ పువ్వుచిన్న‌ది-1, 50గ్రాముల బీన్స్‌, కాప్సిక‌మ్ బెంగుళూరుమిర్చి-1, ఉల్లిపాయ‌చ‌క్రాలు-2, పైనాపిల్ స్ల‌మ్‌సెస్‌-5,2 టీ స్పూన్ల రైస్‌ఫ్లోర్‌,  50గ్రాముల రిఫైండ్ ఆయిల్‌, రుచినిబ‌ట్టి సాల్ట్‌, చిన్నక్యారెట్స్‌-2, 2 టీస్ఫూన్స్ ట‌మోటా కెచెప్‌, 2 టీ స్పూన్ల చిల్లీసాస్‌, 2 టీ స్ఫూన్ల ఆరెండ‌జ్ జ్యూస్‌, 1 టీస్ఫూన్ చింత ర‌సం

 

త‌యారు చేయు విధానము...కాలీఫ్ల‌వ‌ర్‌పూల‌ను కొద్దికాడ‌తో తుంచుకోవాలి. వాటిని ఉప్పునీటిలోకాని వేడినీటి వేసుకుని 1/4గ‌ంట సేపు ఉంచాలి. పురుగులేకుండాపోతుంది. త‌ర్వాత వాటిని బ‌య‌ట‌కు తీసి 1/4 గంట సేపు ఆర‌పెట్టాలి. క్యారెట్‌ముక్క‌లువ‌న్ ఇంచ్‌పీసెస్‌గా క‌ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ‌ల‌ను రౌండ్‌గా క‌ట్‌చేసుకోవాలి. (వాటినే స్రింగ్ ఆనియ‌న్‌పీసెస్ అని అంటారు) కాప్సిక‌మ్‌ను కూడా చిన్న‌విగా పొడ‌వుగా క‌ట్ చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ 3టీస్ఫూన్స్ కొంచెం వేడినీటిలో క‌లుపుకుని పేస్ట్‌లా త‌యారుచేసుకోవాలి. స్వీట్‌పేస్ట్ కొంచెం చెయ్యాలి. అందులో స్టౌ పై పేన్ వుంచి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసివేడిప‌డ‌గానే అందులో క‌ట్ చేసుకున్న వెజిట‌బుల్స్ అన్నీ వేసి అందులో ఈ స్వీట్ పేస్ట్‌వేసి క‌లుపుకోవాలి. కొంచం సాల్ట్‌వేసుకోవాలి. అన్నింటిని స‌న్న‌నిసెగ‌మీద మ‌గ్గ‌నివ్వాలి.

 

1/4గ‌ంట త‌ర్వాత దించుకుని చ‌ల్లార‌నివ్వాలి. స్వీట్ వెజిట‌బుల్‌పేస్ట్ బ‌జారులో అమ్ముతారు. అది ఈ మ‌గ్గిన‌కూర గాయాల‌లో, కార్న్‌ఫ్లోర్‌పేస్ట్‌వేసి క‌ల స్టౌమీద మూత పెట్టి ఉడ‌క‌నివ్వాలి. ఉడికి నాక‌దించుకునిపైన చెప్పిన స్వీట్ పేస్ట్ తియ్యాలి. 2 స్పూన్ల ట‌మోటాకెచెప్‌,1 స్ఫూను చిల్లీసాస్‌, 2 స్పూన్స్ ఆరెంజ్ జ్యూస్‌, 2 స్పూన్స్ పైనాపిల్ జ్యూస్‌, 1 స్పూను చింత‌పండు ర‌సం. వీట‌న్నింటిని క‌లిపి ఒక గిన్నెలో పోసుకుని బాగా క‌లుపుకోవాలి. కూర‌లు ఉడికినాక‌దించుకుని అందులో ఈ పైన చెప్పిన వ‌న్నింటిని క‌లిపిపోసుకుని 2,3నిముషాలు స్టౌ మీదుంచాలి. మొత్తం (పేస్ట్‌లు, 1వంతు వుంచి మిగ‌తాదిపోసుకోవాలి) దించుకుని ఆ మొత్తాన్ని ఒక వెడ‌ల్పాటి డిష్‌లోకి వంచుకుని పైన ఈ మిగిలిన పేస్ట్‌ని పోసుకుని క‌లుపుకోవాలి. ఇదితియ్య‌గా, పుల్ల‌గా, కారంగా ఎంతో టేస్ట్‌గా వుంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు, గెస్ట్‌లు అంద‌రూ ఎంతో ఇష్టంగా ఆద‌రిస్తారు ఈడిష్‌ను చేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: