ఒక వైపు కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మెల్ల మెల్లగా మొదలవుతుంటే, మరో వైపు దీనిపై వింత వింత ప్రచారాలు సాగిస్తున్నారు.. ఇప్పుడున్న పరిస్దితుల్లో మన భారతదేశంలో కరోనా వ్యాప్తిని కనుక అరికట్టకపోతే చాలా పెద్ద మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇప్పటికే తీసుకునే చర్యలు ఏమేర ఫలితాలను ఇస్తున్నాయో పాలకులకే తెలియాలి.. ఇక ఈ కరోనా సోకిన వారి బ్రతుకులకు గ్యారంటీ లేదు.. మరికొన్ని రోజుల్లో చస్తామో, బ్రతుకుతామో తెలియని పరిస్దితి.. నిజం చెప్పాలంటే బ్రతికి ఉండగానే ఈ కరోనా నరకాన్ని చూపిస్తుంది..

 

 

ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే క్రమంలో ఈ నెల 31వరకు రాష్ట్రంలోని అన్నీ విద్యాసంస్థలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సీఈఎస్ చైర్మన్ నాగటి నారాయణ తప్పుబట్టారు. ఇదివరకు ఈ వైరస్‌తో మృతి చెందినవారిని పరిశీలిస్తే వారి వయస్సు 45 సంవత్సరాలు.. ఇలాంటి వారికే కరోనా ఎక్కువగా సోకింది.. అంతే కాకుండా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే పిల్లలకు కరోనా సోకినట్లు కేసులేవీ నమోదు కాలేదు..

 

 

ఇక కరోనా నుంచి రాష్ట్రం సురక్షితంగా ఉందని చెబుతూ.. ఇన్ని రోజులు సెలవులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తూ, కరోనా విషయంలో భయం లేదంటూనే.. మరోవైపు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం 17 రోజుల పాటు సెలవులు ప్రకటించడం సరైన నిర్ణయం కాదంటూ పేర్కొన్నారు.. ఒకవేళ సెలవులంటూ ప్రకటిస్తే పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా వేయాలి.. కానీ ఇవి యధాతధంగా జరుగుతాయని చెప్పినప్పుడు.. ఆ పిల్లలకు కరోనా సోకదని భరోసా ఇవ్వగలరా. ఇదేగాక ఈ సెలవుల వల్ల మధ్యాహ్న భోజనం లేకపోతే బాధపడే విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి మరోసారి అన్ని విషయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు సీఈఎస్ చైర్మన్ నాగటి నారాయణ తెలిపారు.

 

 

ఇకపోతే కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, థియేటర్ల్‌ను బంద్ చేయాలనే ఆదేశాలు జారిచేసింది... అయితే మార్చి 19 నుంచి మొదలు కానున్న పదో తరగతి పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని చెప్పారు. ఇక ఇలాంటి సమయంలో నారాయణ గారు చేసిన వాఖ్యలు మంచికో చెడుకో అర్ధం కాకుండా ఉన్నాయని ఈ విషయం తెలిసిన ప్రజలు అనుకుంటున్నారట.. మరి తెలంగాణ ఆర్టీసీ బంద్ సమయంలో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అప్పుడు తెలియదా ఈ బంద్ విషయం అని మరికొందరు ఎదురు ప్రశ్నలేస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: