ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఇలా ఏపీలోనే రాజకీయాలు ఆసక్తిగా మారాయనుకుంటే.. మధ్యప్రదేశ్ రాజకీయాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. కాగా., మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ కు రాజ్యాంగ పరంగా వారికి ప్రభుత్వాన్ని నడిపే హక్కు లేదన్నారు. అయితే.. శివరాజ్ సింగ్ చౌహాన్ రేపు మధ్యప్రదేశ్‌ లోని కాంగ్రెస్ సర్కార్ బలపరీక్షను ఏరుదుర్కొవాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ లాల్టీ టాండనే స్వయంగా ప్రకటించారు. అయితే.. ఆ రాష్ట్ర గవర్నర్ అయిన టాండన్‌ ను మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో శనివారం బీజేపీ బృందం కలిసి కాంగ్రెస్ అసెంబ్లీ బలపరీక్ష నిర్వహించాలని ఆయనను కోరింది. దీంతో..  బీజేపీ నేతలు టాండన్‌ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ బలపరీక్షను బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే నిర్వహించాలని, దీనికి గాను గవర్నర్‌ కు వినతి పత్రం కూడా సమర్పించారని తెలిపారు. 

 

 


కమల్‌ నాథ్ నేతృత్వంలో 2018 లో కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉంది. అప్పటి నుంచి జ్యోతిరాదిత్య సింధియాకు, కమల్‌నాథ్ కు అంతర్గతంగా యుద్ధం నడుస్తుందని చెప్పవచ్చు. దింతో సింధియా పార్టీకి రాజీనామా చేశారు.  సింధియా రాజీనామాతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ లో రాజకీయం మారిపోయింది. బీజేపీ ఆడిన రాజకీయ చదరంగంలో కమల్‌నాథ్ సర్కార్ పావుగా మారారు. కమల్‌నాథ్ సర్కార్ అసెంబ్లీలో తమ బల పరీక్ష నిరూపించుకునేంతవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికి లేదని తీర్మానించారు. 

 

 


సింధియా రాజీనామా చేసి వెంటనే బీజేపీలో చేరారు. ఆయన రాజీనామా లేఖలో నేను కాంగ్రెస్‌ లో ఉంటే ప్రజలకు సేవ చేయలేనని, అందుకే తాను పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరుతున్నానని లేఖలో పేర్కొన్నారు. దీంతో కమల్‌నాథ్ సర్కారు మైనారిటీలో పడిపోయింది. గవర్నర్ టాండన్‌ ను కలిసిన కమల్ నాథ్ బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. దీంతో బలపరీక్షను ఎలా ఎదుర్కొంటారని ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: