విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే తప్పుల మీద తప్పులు చేసి గౌరవమైన ఉపాధ్యాయుడు అనే పదానికి మహాచెడ్డ పేరు ను తీసుకొస్తున్నారు. ఒక్కసారి పెళ్లైన తరువాత మరొక పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు అని తెలిసి కూడా ఒక ప్రిన్సిపాల్ ఆ తప్పు చేసి అందరి చేత ఛీ కొట్టించుకుంటున్నాడు.



వివరాలు తెలుసుకుంటే... రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని కార్మికనగర్‌ నివాసి అయిన 42 ఏళ్ల అయూబ్ అలీ... హబీబ్ ఫాతిమా నగర్‌ ప్రాంతంలోని కార్మికనగర్‌ చెందిన ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్ గా వర్క్ చేస్తున్నాడు. ఐతే అదే పాఠశాలలో 23 ఏళ్ల యువతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే సదరు ప్రిన్సిపాల్ యంగ్ టీచర్ పై కన్నేశాడు. తనకు పెళ్లి కాలేందంటూ అబద్దాలు ఆడుతూ కమ్మటి మాటలు కలిపి లైన్ లో పెట్టాడు. ఆ మహిళా టీచర్ కూడా ప్రిన్సిపాల్ మాయమాటలు ఫిదా అయిపోయింది. ఒకరోజు పెళ్లిచేసుకుందామని ఆమెను అడిగాడు ఆ ప్రిన్సిపాల్. దాంతో ఆమె ఓకే చెప్పగా వీళ్ళిద్దరూ కలిసి 10 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.





ఐతే సదరు ప్రిన్సిపాల్ ఒట్టి మోసగాడని, అతడికి పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఉపాధ్యాయురాలి కుటుంబ సభ్యులకు తెలిసింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె కుటుంబ సభ్యులు నేరుగా పాఠశాలకు వెళ్లి కనపడిన ఫర్నిచర్, కంప్యూటర్స్, పూలకుండీలు ద్వంసం చేశారు. అలానే బాధితురాలైన టీచర్ మోసపు ప్రిన్సిపాల్ అయూబ్ అలీ పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తక్షణమే అయూబ్ అలీ ని అదుపులోకి తీసుకొని కఠినమైన శిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ముందు వెనక తెలియకుండా తత్తరపాటు తో ఓ మోసపు వ్యక్తి ని పెళ్లి చేసుకున్నందుకు బాగా పశ్చాత్తాప పడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: