దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ... పలు చోట్ల స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు, పెళ్లిళ్లు, క్రీడలు ఇంకా ఇతరత్రా... అంశాలు వాయిదా పడుతున్న సంగతి తెలిసినదే. ఇక మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమౌతున్న సమయంలో, టీడీపీ కొత్త వాదనను తెరపైకి తీసుకు వచ్చింది. అదేమంటే, రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ ప్రబలుతుండటం వలన స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేయడం విశేషం. ఈ మేరకు ఇటీవల టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆడిన మాటలు పలు చర్చలకు దారితీస్తోంది.

 

ఈ విషయంపైన స్పందించిన మంత్రి బొత్స, ఇంకా పలువురు నేతలు టీడీపీకి కౌంటర్లు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల వలసలు జోరుగా సాగుతున్న సమయంలో.. వారి ఉనికిని ఎక్కడ కోల్పోతామో అని భయపడిన చంద్రబాబు... తమ కార్యకర్తలను, నాయకులకు అనవసర తాయిలాలు ఇచ్చి, మామీద వుసిగొలుపుతున్నారని మండిపడ్డారు. ఇక ఇప్పుడు కరోనా వైరస్ ను వాడుకుని ఎన్నికలను వాయిదా వేయమని వారు కోరడం వెనుక వారి.. అపరాధభావన అర్ధమౌతోందని అన్నారు.

 

కానీ ఎలాంటి ప్రతికూల పరిస్తితులైనా వైసీపీకు పోయేదేమీ ఉండదని వారు అన్నారు. సరే ఇపుడు వారు అనుకున్నట్లు గానే.. ఎన్నికలు వాయిదా పడే పరిస్థితి వున్నా సరే.... ఇపుడు ఈ రెండు, మూడు వారాల గ్యాప్ కూడా మాకు ఎక్కడ అనుకూలమౌతుందో.. ఈ లాంగ్ గ్యాప్‌లో ఇంకెన్ని ఏక‌గ్రీవాలు అయిపోతాయో అని మరలా వారి ఏడుపులు వినపడక తప్పదని పలువురు వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకొని మాట్లాడారు.

 

ఇటీవల వైసీపీని సోమిరెడ్డి ప్రశ్నిస్తూ... ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా? ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొన్ని లక్షల మంది క్యూల్లో నిలబడాల్సి ఉంటుందని, దీని వల్ల కరోనా విస్తరించే అవకాశం మెండుగా ఉంటుందని... హెచ్చరించిన విషయం మనకు విదితమే. ఇక కరోనా వైరస్ మరింత విస్తరించి ప్రజలకు ఏమైనా జరిగితే మాత్రం, ప్రభుత్వం, అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్ దే బాధ్యతని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: