ఇంట్లో నుండి కాలు బయటపెడితే తిరిగి క్షేమంగా ఇల్లు చేరుకుంటామనే నమ్మకం ఉండటం లేదు.. ఒక వైపు కరోనా అని పరెషాన్ అవుతుంటే, మరో వైపు రోడ్డుప్రమాదాలు కళ్లముందే మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి.. ఎన్ని కుటుంబాలు వీధినపడుతున్నాయో ఇలాంటి ప్రమాదాల వల్ల.. ఇలాగే ఓ కుటుంబం దైవదర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి తిరుగుప్రయాణం అయ్యారు. కానీ విధి చిన్నచూపు చూసిందేమో, ఆ దేవుడు కూడా కాపాడలేకపోయాడు.. కళ్లముందే తండ్రి కూతురి ప్రాణాలు తీస్తుకెళ్లాడు.. ఆ తల్లిని మాత్రం ఈ ఘోరానికి సాక్షిగా మిగిల్చాడు.. హృదయాన్ని కలిచివేసే ఈ ఘటన తాలూకు వివరాలు తెలుసుకుంటే..

 

 

పెద్దవడుగూరు ఏడీసీసీ బ్యాంకులో సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న గుత్తి పట్టణంలోని కుమ్మర వీధికి చెందిన కరణం కృష్ణమోహన్‌(51), తన భార్యను, కూతురిని తీసుకుని ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి శనివారం అద్దె కారులో వెళ్లారు. ఆనందంగా భక్తితో దైవ దర్శనం చేసుకున్న అనంతరం వీరు అనంతపురం మీదగా గుత్తికి బయల్దేరారు. ఈ క్రమంలో గార్లదిన్నె మండలం రామదాస్‌పేట గ్రామ మలుపు వద్దకు రాగానే కారు అదుపుతప్పి రెండు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన గుంతలో పడిపోగా, ఈ ప్రమాదంలో కృష్ణమోహన్, అతని కూతురు ఆశా అక్కడిక్కడే మరణించారు.. కృష్ణమోహన్ భార్య సౌభాగ్య లక్ష్మి, కారు డ్రైవర్‌ మధు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో భయటపడ్డారు..

 

 

కాగా రక్తమోడుతున్న సౌభాగ్య లక్ష్మి భర్త, కుమార్తెల మృత దేహాలపై పడి దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ రోదిస్తున్న తీరు పలువురిని కలచివేస్తుంది. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో గాయపడ్దవారిని ఆస్పత్రికి తరలించారు. సౌభాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదే హాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఉదయం వరకు అందరితో కలిసి ఉన్న కుటుంబంలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, మరొక కుటుంబ సభ్యరాలు తీవ్రంగా గాయపడటంతో గుత్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి... ఆనందంగా ఇల్లుచేరుకుంటామని ఆశించిన వీరి జీవితాల్లో చీకట్లు నిండాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: