కరోనా ఫోబియాతో భారత్ బిక్కు బిక్కు మంటోంది. ఇటీవల సంభవించిన రెండు మరణాలు... పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, అన్ని రాష్ట్రాలలో ఇంచుమించుగా... పలు సంస్థలను మూసివేయవలసిందిగా సదరు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసాయి. వారి ఆదేశాలను అనుసరిస్తూ... పలు స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు.. ఇంకా పలు సంస్థలను ఇప్పటికే మూసివేశారు.

 

 

 

కర్ణాటక వాసి, 76 సంవత్సరాల వృద్ధుడు.. కరోనా వ్యాధితో మరణించిన మొదటి వ్యక్తి కావడంతో... అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యి, మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వారం రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, పార్కులు, పబ్‌లు, నైట్ క్లబ్బులు,  మాల్స్ అన్నీ మూసివేయాలని అక్కడి ప్రభుత్వం సదరు సంస్థలకు ఆదేశించగా.. వారు అనుసరించారు. దీనితో ప్రస్తుతం కర్ణాటక అంతటా వాతావరణం నిర్మానుష్యంగా ఉంది. రోడ్లు, వీధులు అన్నీ విశాలంగా కనిపిస్తున్నాయి. 

 

 

 

ఇక పలుచోట్ల థియేటర్లు మూతపడటంతో... అటువైపు ఒక్కరు కూడా వెళ్లడం మానేశారు. మెట్రో రైళ్లలో రద్దీ పూర్తిగా తగ్గింది. ఇక ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ బెంగళూరు ఐఐపీఎం కాంప్లెక్స్‌లోని కార్యాలయాన్ని శనివారం తాత్కాలికంగా ఖాళీచేసింది. తమ ఉద్యోగి ఒకరు.. కరోనా రోగిని కలిసినట్లు సమాచారం రావడమే ఇందుకు గల ముఖ్య కారణంగా మనకు తెలుస్తోంది. అయితే.. సిబ్బంది ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇది కేవలం ముందుజాగ్రత్త చర్యేనని ప్రకటించింది.

 

ఇక ప్రస్తుతం బీహార్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నితీష్ సర్కార్ ఇక్కడి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. కేరళలో ఈ నెల 31 వరకు, అక్కడి ప్రభుత్వం సెలవులను ప్రటించిన విషయం విదితమే. ఢిల్లీ లో కూడా అక్కడి ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలు, థియేటర్లు మూసివేయాలని ఆదేశించింది. గోవా.. జమ్మూ కాశ్మిర్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో పలు విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, పబ్బులు, ఫంక్షన్ హాళ్లను మరో రెండు వారాల పాటు తెరవకూడదని సదరు ప్రభుత్వాలు ఆదేశించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: