ఎక్కువగా ప‌రిచ‌యం లేని వారికి తొంద‌ర‌ప‌డి ఫోన్ నెంబ‌ర్లు ఇవ్వ‌కూడ‌దు. అది ఎంత ప్ర‌మాద‌మంటే దాన్ని ఆస‌రాగా తీసుకుని ఆక‌తాయిలు ఎలాంటి ప‌నులు చేయ‌డానికైనా సిద్ధ‌మ‌వుతున్నారు. ఒక అమ్మాయి ఫోన్ నెంబ‌ర్ తెలిస్తే చాలు వాట్సాప్ చాటింగ్‌లు, చీటింగ్‌లు ఎక్కువ‌యిపోయాయి. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి స‌మ‌యాల్లో చాలా తెలివిగా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఇటీవ‌లె ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే...

 

ఓ యువ‌కుడు వాట్సాప్‌లో ప‌రిచ‌య‌మైన వివాహిత‌ను లైంగికంగా ఇబ్బంది పెట్ట‌డం మొద‌లుపెట్టాడు. చెన్నై నగరానికి చెందిన మహిళ(37)కు కమ్యూనిటీ స్నేహితుల ద్వారా కొద్దిరోజుల క్రితం కొళత్తూర్‌కు చెందిన వివేకానందన్‌ అనే యువకుడికి  పరిచయమయింది.  అతను ఓ ప్రైవేటు కంపెనీలో ప‌ని చేస్తున్నాడు. స్నేహితుల ద్వారా ప‌రిచ‌య‌మైన వ్య‌క్తి కాబ‌ట్టి ఆ యువ‌తి అత‌నితో వాట్సాప్‌లో కాస్త క్లోజ్‌గా చాటింగ్ చేయ‌డం మొద‌లు పెట్టింది. ఇద్దరు ఆరు నెలలుగా వాట్సాప్‌లో చాటింగ్‌ చేసుకొంటున్నారు. ఆ త‌ర్వాత త‌ర్వాత అదికాస్త ముదిరి ఆ యువ‌కుడు ఆ అమ్మాయితో అస‌భ్య‌క‌ర‌మైన చాటింగ్ చేయ‌డం మొదుల పెట్టాడు. కొన్ని భూతు బొమ్మ‌ల‌ను కూడా షేర్ చేయ‌డం మొద‌లుపెట్టాడు.

 

దాంతో ఆ ధోర‌ణి న‌చ్చ‌ని ఆ మ‌హిళ ముందు అత‌డిని ఖండించింది. ఆ విధంగా మాట్లాడొద్దంటూ మంచిగా చెప్పింది కానీ అత‌డు విన‌లేదు.ఆ విధంగానే మాట్లాడ‌టం మొద‌లుపెట్టాడు. దాంతో అది న‌చ్చ‌క ఆమె నిధానంగా అత‌నితో మాట్లాడ‌టం కట్ చేసింది. దీంతో వివాకానంద బాగా ప‌గ‌బ‌ట్టి ఆమె భ‌ర్త లేని స‌మ‌యం చేసుకుని ఇంటికి వెళ్ళి త‌న కామ వాంఛ తీర్చాలంటూ బ‌ల‌వంత పెట్టాడు. అలాగే త‌ను అడిగినంత డ‌బ్బులు కూడా ఇవ్వాలంటూ లేదంటే చాటింగ్ మొత్తం భ‌ర్త‌కి చూపిస్తానంటూ బెదిరాస్తాడు. దీంతో ఆమె రివ‌ర్స్ అవ్వ‌డంతో నువ్వు రాక‌పోతే నీ భ‌ర్త‌ను చంపేస్తానంటూ బెదిరించాడు.

 

ఇక లాభం లేదంటూ ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించి కంప్లైంట్ ఇచ్చింది. చెన్నైలోని కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో... ఇన్‌స్పెక్టర్‌ మాదేశ్వరన్‌, ఎస్సై భూపతిరాజ్‌ ఆమె ఇచ్చిన ఆధారాలను పరిశీలించి నిందితుడిపై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: