కరోనా వైరస్ వలన ప్రాణాంతకమైన కోవిడ్ 19 అనే శ్వాసకోస సంబంధిత వ్యాధి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక లక్షా 30వేల మందికి పైగా ఈ కరోనా సోకగా... మన దేశంలో 90 వరకు కేసులు నమోదు కాగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇకపోతే మొట్టమొదటి కరోనా పీడిత ప్రాంతమైన వుహాన్ నగరంలో సాధారణ ఉష్ణోగ్రతలు 5°C నుండి 11 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు ఉంటాయి. ఐతే ప్రస్తుతం బ్యాంకాక్ లో మాత్రం 40°C సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం బ్యాంకాక్ లోకి వైరస్ బారిన పడిన విదేశీయులు ఎంతమంది అడుగుపెట్టినా వారి నుండి ఇతర స్థానికులకు వైరస్ సోకలేదట. కానీ చల్లగా ఉన్న దేశాల్లో ఉదాహరణకి ఇటలీ, అమెరికా, ఇరాన్ లలో వైరస్ వ్యాప్తి వేగవంతంగా ఉందని తెలుస్తుంది.




వాస్తవానికి తేమ, తడి వాతావరణం ఉన్న ప్రాంతాలలో ఏ వైరస్ అయినా బుల్లెట్ ట్రయిన్ స్పీడ్ తో అంతటా సంక్రమిస్తుంది. కానీ వేడి వాతావరణం ఉన్న ప్రాంతాలలో వైరస్ సంక్రమణ చాలా నెమ్మదిగా ఉంటుంది. ప్రముఖ వైద్యులంతా ఈ నిజాన్నే బల్లగుద్ది చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్తలు ఈ విషయాన్నే ప్రజలకు తెలియజేస్తూ భయపడవద్దని ధైర్యం చెబుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ ఉష్ణోగ్రతలు మన దేశంలో నమోదవుతున్నాయని... అందుకే చాలా తక్కువ మంది కరోనా బారిన పడ్డారని, మరో రెండు మూడు వారాల్లో అనగా ఏప్రిల్ 10 లోపు ఈ వైరస్ సంక్రమణ పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతుందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ తెలిపారు.





మరణాల సంఖ్య గురించి తెలియజేసే కొన్ని కంప్యూటర్ బేస్డ్ మోడల్స్ వచ్చాయని... అవి చెప్పిన ప్రకారం చాలా లక్షల మంది కోవిడ్ 19 వలన మరణిస్తారని ఓ అంచనా వేశారని... కానీ అవేమి మన ఇండియాకి వర్తించవని హైదరాబాద్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇకపోతే మన దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే సినిమా హాళ్లను, పాఠశాలలని, కళాశాలను మూసి వేయాలని ఆదేశాల జారీ చేసాయి. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో పెరిగితే వైరస్ సోకకుండా ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా రాష్ట్రాలు తెలిపాయి. ఏది ఏమైనా హాట్ టెంపరేచర్ కేవలం వ్యాధి సంక్రమణని మాత్రమే అడ్డుకుంటుంది తప్ప వైరస్ ని వెంటనే చంపలేదు. ఈ సమయంలో వర్షాలు వస్తే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మనదేశంలో 2, 3 నెలలు బాగా ఎండలు మండితే కరోనా శాశ్వతంగా అంతమవుతుంది. జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలు ఎదురైతే ఇతరులతో కలవకుండా వెంటనే వైద్యులను సంప్రదించడంలో చాలా ముఖ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి: