క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తోంది. ఈ రోజురోజుకూ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమక్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం అబ్బా అంటోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జన్సీన ప్రకటిస్తున్నాయి అంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంకాంగ్, మలేషియా, నేపాల్, సింగపూర్, , తైవాన్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్, వియత్నాం దేశాల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది.

 

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్.. తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టి క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు , జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో కరోనా బారిని పడి మరణిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇక ఢిల్లీలో కోవిడ్‌-19 కారణంగా మృతి చెందిన 68 ఏళ్ల మహిళ అంత్యక్రియలపై వివాదం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. దీంతో  కరోనా మృతుల అంతిమ సంస్కారాలపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ రెడీ అవుతోంది. 

 

వాస్త‌వానికి  మృతుల శరీరాల నుంచి ఇతరులకు వ్యాధి సోకే అవకాశం లేకపోయినప్పటికీ.. ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలను తొలగించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదం చేస్తాయ‌ని విశ్వ‌సిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే  శ్వాస సంబంధిత వ్యాధి అయిన కోవిడ్‌ దగ్గు, తుమ్ముల వల్ల బయటకు వచ్చే ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని, మార్చురీ నుంచి లేదా మృతదేహం నుంచి వ్యాపించే అవకాశం లేదని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్ల‌డించారు. ఎబోలా, నిఫా వంటి వైరస్‌లు మృతుల శరీరాల నుంచి వెలువడే ద్రవాలను తాకడం ద్వారా రావచ్చుకానీ కరోనా అలా కాదని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: