హయ్యో.. పాపం.. ఎంత అన్యాయమే.. బాబోరుకు ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తూనే ఉందే. ఇన్ని సమస్యలు వస్తే ఎలా? అయినా చేసిన పాపం ఊరికే పోతుందా? కష్టాలు పడక తప్పదు మరి. గత 5 ఏళ్ళల్లో ఎన్ని కుట్రలు చేశారు? ఎన్ని దగలు చేశారు? అసలు అయన జీవితకాలంలో ఎప్పుడైనా ఏ మంచి పనైనా చేశాడా అని నెటిజన్లు ఎప్పుడు కామెంట్ చేస్తుంటారు.           

 

సరే ఇది అంత పక్కన పెడుదాం. బోబోరికి గత కొద్దీ రోజులుగా సీఎం జగన్ వల్ల చుక్కలు కనిపిస్తున్నాయ్. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఏలాంటి చిల్లర వేషం వేసిన సరే అవి తిరిగి పడుతున్నాయ్. ఏదో చెయ్యాలి అనుకోని సీఎం జగన్ వ్యతిరేకపడితే అది కాస్త చంద్రబాబు మెడకే చుట్టుకుంటుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కొద్దీ రోజుల్లో జరుగుతాయి అని స్థానిక ఎన్నికల్లో ఎంతో పెద్ద ఎత్తున యేవో ఎత్తులు వేస్తే.. ఆ ఎత్తులకు పై ఎత్తులు సీఎం జగన్ వేసి వారికీ చుక్కలు చూపించారు. అయితే.. ఎన్ని పై ఎత్తులు వేసిన నేను తిరగపడుతాను అన్నట్టు చంద్రబాబు ప్లాన్స్ వేసుకుంటుంటే ఇప్పుడు కరోనా వైరస్ కూడా దెబ్బ తీస్తుతుంది. 

 

ఇన్నాళ్లు సీఎం జగన్ చంద్రబాబుకు చుక్కలు చూపిస్తే.. ఇప్పుడు కరోనా వైరస్ కూడా చుక్కలు చూపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా స్థానిక ఎన్నికలు 6 వారాల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ వాయిదానే అతనికి పెద్ద దెబ్బ. ఎందుకంటే ? ఈ 6 వారాలలో ఉన్న టీడీపీ నేతలు అందరూ కూడా వైసీపీలో చేరుతారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే బాబోరుకు కరోనా వైరస్ కూడా పెద్ద దెబ్బ వేసింది అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: