అదనపు కలెక్టర్ బయటకు వెళ్లకుండా అడ్డుకున్న ఘటన రాజన్న సిరిసిల్లి జిల్లాలోని ఎల్లారెడ్డి పేట లో చోటు చేసుకుంది. జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య ఇటీవలే నూతనంగా బదిలీ పై రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చారు. అయితే.. ఆయన ఆదివారం ఎల్లారెడ్డి పేటలోని డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించడానికి రెవెన్యూ అధికారులతో సహా అక్కడికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న నలుగురు హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. 


అనంతరం అదనపు కలెక్టర్ అంజయ్యను చూసి వారు డబ్బు కావాలని అడగటంతో కలెక్టర్ జేబులోంచి పర్సు తీసి ఆయనకు తోచినంత ఇచ్చి పొమ్మన్నారు. దానికి నిరాకరించిన హిజ్రాలు మీరు ఇచ్చిన డబ్బులకు సంతృప్తి చెందలేదని మాకు ఇంకా డబ్బులు కావాలని అడగటంతో అంజయ్య ఇవ్వనని చెప్పారు. కానీ.. హిజ్రాలు రూ.5,116 ఇవ్వాలని ఆయన్ని డిమాండ్ చేశారు. ఆయన ఇవ్వటానికి ససేమీరా అనటంతో ఆయనను అక్కడి నుండి పోనివ్వకుండా అడ్డుగా నిలబడ్డారు. దీంతో అక్కడి నుంచి మేము వెళ్లాలంటే మాకు డబ్బు ఇవ్వాల్సిందేనని.. లేదంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పోనివ్వమని  హిజ్రాలు కలెక్టర్ తో అన్నారు. 


అక్కడ అదనపు కలెక్టర్‌ అంజయ్యతో పాటు అక్కడ ఉన్న రెవిన్యూ అధికారులు కూడా అక్కడి నుంచి హిజ్రాలను వెళ్లాలని కోరారు. కానీ వారు ఎంత చెప్పిన కూడా అక్కనుంచి కదల్లేదు. దీంతో కోపోద్రిక్తులైన రెవిన్యూ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయినా కూడా వారు డబుల్ బెడ్రూం ఇళ్ళ దగ్గర నుంచి కదల్లేదు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి హిజ్రాలను బయటకు పంపించి వేశారు. అప్పటి వరకు అక్కడ వేచి ఉన్న అదనపు కలెక్టర్ అంజయ్య ఇళ్ళ నిర్మాణాలను పూర్తిగా పరిశీలించారు. తర్వాత వారు వెళ్లిపోయారని పోలీసులు చెప్పటంతో అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: