ప్ర‌స్తుతం ఎటు చూసినా ఈ ప్రాణాంత‌క వ్యాధి గురించే మాట్లాడుకుంటున్నారు. ప్ర‌పంచాన్ని మొత్తం ఒకేసారి గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది ఈ వ్యాధి. చైనాలోని వూహాన్ అనే ప్రాంతంలో ఈ వ్యాధి పుట్టింది. వ్యాధి పేరు క‌రోనా వైర‌స్‌గా క‌నుగొన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాధిని క‌ట్ట‌డిచేసే ప‌నిలో ఉంది చైనా. వ్యాధి నిర్ధార‌ణ అయిన త‌ర్వాత వూహాన్‌లో దాదాపు ల‌క్ష‌కిపైగా వ్యాపించింది. దీని కోసం  చైనా అధికారులు కఠినమైన చర్యలు చేపట్టి ఐసోలేషన్ చేసి వైరస్ ను అదుపు చేశారు. దీంతో  వూహాన్ లో కొత్త కేసుల పుట్టుకు రావ‌డం లేదు.

 

ఇక చైనా మొత్తం ఈ వైర‌స్ కి భ‌య‌ప‌డి ఫేస్‌కి మాస్క్‌లు,చేతికి గ్లౌజులు, క్ర‌మం త‌ప్ప‌కుండా ఇలాంటి జాగ్ర‌త్లు అన్నీ పాటిస్తున్నారు. ప‌రిశుభ్ర‌త మీద ఎక్కువ‌గా శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. వైర‌స్ దేని వ‌ల్ల వ్యాపిస్తుందో దాన్ని అరిక‌ట్టే విధంగా చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. అలాగే రోగుల‌కుకూడా మెరుగైన ఔషధాలను  ఇస్తూ రోగాన్ని త‌రిమిపారేసే ప‌నిలో ప‌డ్డారు.

 

ఇక క‌రోనా  ఒక అంటు వ్యాధి అని చెప్పాలి. ముఖ్యంగా గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంద‌ని వైధ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటలీ - ఇరాన్ - దక్షిణ కొరియా దేశాల్లో మరణ మృందంగం వాయిస్తోంది. ఈ వ్యాధి సోకి ఇప్ప‌టికే  వందలాది మంది చనిపోయారు. ఇటలీలో అయితే ప్రజలందరిని ఇంట్లోంచి బయటకు రావద్దని గృహనిర్బంధ‌న చేశార‌ట‌.

 

దీంతో తాము కట్టడి చేసిన కరోనా కారణంగా ఇత‌ర దేశాల‌లోని  వందలాది మంది చనిపోవడంతో ఇక లాభం లేదంటూ చైనా రంగంలోకి దిగింది. ఆ దేశాలకు సహాయ బృందాలను పంపుతోంది. అంతేకాదు.. తీవ్రత ఎక్కువగా ఉన్న ఇటలీకి దాదాపు అర మిలియన్ ఫేస్ మాస్క్ లను విరాళంగా ఇచ్చింది. తాజాగా చైనాలోని షాంఘై సుంచి విమానం బయలు దేరి బెల్జియంలోకి చేరుకొని అక్కడి నుంచి ఇటలీకి బయలు దేరింది.

 

ఇక ఇటలీ దేశంలో మరణాలు ఎక్కువగా జరుగుతుండడంతో చైనా ఆ దేశానికి వైద్య బృందాల‌ను స‌హాయ నిధి కోసం పంపించింది. ఈ అంటువ్యాధి దేశాల‌న్నిటినీ కూడా  అతలాకుతం చేస్తున్న నేపథ్యంలో చైనా ఇలా ముందుడుగు వేయడం పై ప్రపంచ దేశాల‌న్నీ కూడా ఎంతో ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: