ప్ర‌స్తుతం స‌మాజం ఎటుపోతుందో అర్థంకావ‌డం లేదు. మరుగున పడుతున్నదా మానవత్వం.. అంతరించనున్నదా భరతమాత నేర్పిన సంస్కారం. ఇదీ ఇప్పుడు ప‌రిస్థితి. నేరాల‌కు, ఘోరాల‌కు తావులేకుండా పోతుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువ‌తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ‌కులు కొద్ది రోజుల‌కే జీతం కోసం వేధించ‌డం మొద‌లుప‌ట్టాడు. జీతం మొత్తం తనకే ఇవ్వాలంటూ స‌ద‌రు భర్త ఒత్తిడి తెసుకొచ్చేవాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తన రాక్షసత్వాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఈ క్ర‌మంలోనే భార్య, అత్త, భార్య సోదరి ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలు రాస్తున్నాడు. 

 

ఇక భర్త వేధింపులు భరించలేకపోయిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న మాలతి.. తన సహోద్యోగిని ప్రేమించి ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి ముందు మాల‌తి.. తన తల్లి, సోదరికి సాయంగా ఉంటానని, జీతంలో సగం వారికే ఇస్తానంటూ చెప్పింది. మాల‌తి చెప్పిన కండీష‌న్స్‌కు ఒప్పుకునే పెళ్లిచేసుకున్నాడు. ఇక పెళ్లైన రెండు నెలలకే అతడికి బెంగళూరుకు ట్రాన్స్‌ఫర్ కావడంతో అక్కడికి వెళ్లిపోయాడు. 

 

దీంతో భర్త కోసం ప్రతి రెండు వారాలకోసారి ఆమె బెంగళూరు వెళ్లేది. అయితే ఆరు నెలల తర్వాత మాలతి కూడా బెంగళూరుకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. కొద్దిరోజులకే జీతం మొత్తం తనకే ఇవ్వాలంటూ ఆ యువకుడు భార్యను వేధిచడం మొదలుపెట్టాడు. దానికి నిరాక‌రించింది మాల‌తి. దీంతో స‌ద‌రు వ్య‌క్తి నీచ‌పు ఆలోచ‌న చేశాడు. ఈ క్ర‌మంలోనే  భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచే పనులు మొదలుపెట్టాడు. తన అత్త, భార్య, మ‌ర‌ద‌లు త‌మ‌ స్నేహితులు వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫోటోలను 'వీరంతా దేశముదుర్లు' అని పేర్కొంటూ ఫేస్‌బుక్ ఖాతాల్లో పోస్టు చేయడం మొదలెట్టాడు. 

 

అంతేకాకుండా.. సాయంత్రం, రాత్రివేళల్లో మీకు ఆ సుఖం కావాలంటే వీరిని సంప్రదించడంటూ కామెంట్లు కూడా పెట్టాడు. దీంతో ఆ ఫోటోలను చూసిన కొందరు వ్యక్తులు మాలతికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడేవారు. ఈ వేధింపులను భరించలేక మాల‌తి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు పిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: