క‌రోనా వైర‌స్ అనుమానాలు రోజురోజుకు పెరుగుతుండ‌డంతో ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఇత‌ర దేశాల నుంచి హైద‌రాబాద్ వ‌చ్చే వారి విష‌యంలో చాలా కేర్‌గా ఉంటోంది. ఇక క‌రోనా వ‌చ్చింద‌ని తెలిస్తే వారిని ప్ర‌భుత్వ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచి మ‌రీ వైద్యం అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ అనుమానాల‌ను నివృత్తి చేసేందుకు సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా ఆదివారం మ‌ధ్యాహ్నం ప్రెస్‌మీట్ పెట్టారు. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన అనంత‌రం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు. క‌రోనా వైర‌స్ విష‌యంలో ఎలాంటి అనుమానాలు. అపోహ‌లు వ‌ద్ద‌ని.. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంద‌ని తెలిపారు. ఇక పారాసిట‌మ‌ల్ ట్యాబ్లెట్ కూడా క‌రోనాకు మందే అని జ‌గ‌న్ చెప్పారు.


ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా అనుమానాలు ఉన్న 70 మంది బాధితుల నుంచి శాంపుల్స్ తీసుకుంటే వీరిలో కేవ‌లం ఒక్క‌రికి మాత్ర‌మే క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్టు నిర్దార‌ణ అయ్యింద‌ని చెప్పారు. ఇక క‌రోనాకు మెడిటేష‌న్ కూడా ఒక మందే అని జ‌గ‌న్ చెప్పారు. ఇక క‌రోనా సోకిన వారిలో 13 శాతం మంది ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని.. వీటిల్లో కేవ‌లం 4.1 శాతం మంది మాత్ర‌మే క్రిటిక‌ల్ ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని జ‌గ‌న్ చెప్పారు. ఇక క‌రోనా బాధితుల్లో 60 సంవ‌త్స‌రాల పైన వ‌య‌స్సు ఉన్న వారు మాత్ర‌మే చ‌నిపోతున్నార‌ని... క‌రోనా పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులు ఇంట్లోనే న‌య‌మ‌వుతున్నాయ‌న్నారు.


క‌రోనా బాధితుల్లో లివ‌ర్‌, బీపీ, గుండె, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న వారే ఎక్కువ మంది చ‌నిపోతున్నార‌ని... మిగిలిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌డం లేదని జ‌గ‌న్ చెప్పారు. ఇక క‌రోనాను క‌ట్టడి చేసే ప్ర‌క్రియ ఒక‌టి రెండు వారాల్లో ఆగ‌కూడ‌ద‌ని.. ఇది యేడాది పాటు నిరంత‌రాయంగా కొన‌సాగుతుంద‌ని జ‌గ‌న్ చెప్పారు. నెల్లూరులో ఓ వ్యక్తికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిసిన వెంట‌నే అక్క‌డ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని. రేప‌టి నుంచి విశాఖ‌తో పాటు రాష్ట్రంలో ప‌లు చోట్ల క‌రోనా బాధితుల కోసం ప్ర‌త్యేక ఐసోలేష‌న్ వార్డులు ఏర్పాటు చేస్తున్న‌ట్టు జ‌గ‌న్ తెలిపారు.  
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: