ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మిడిల్ ఈస్ట్ లో చాలా భయంకరంగా ఉంది. ముఖ్యంగా ఇరాన్ దేశంలో ఈ వ్యాధి ప్రభావం తల గట్టిగా కనబడుతోంది. దాదాపు కొన్ని వందల మంది ఈ వ్యాధి వల్ల చనిపోయినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం పరిపాలిస్తున్న నాయకులు దేశ అధ్యక్షులు ఈ వ్యాధి గురించి భయపడుతున్నారు. ఇదే తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా ఈ వ్యాధి తమ దేశంలో రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులపై ఉపయోగించే టెక్నాలజీని కరోనా వైరస్ పై ఉపయోగించడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఇజ్రాయెల్ దేశంలో ఎన్నికలు ముగిశాయి.

 

ఆ తర్వాత ఈ వ్యాధి ప్రభావం ఎక్కువ అవటంతో ఇటువంటి తరుణంలో ఇంకా ఎన్నికల ఫలితాలు రాకముందే...బెంజమిన్ నెతన్యాహు ప్రధాని హోదాలో ఉండటంతో గతంలో...బాధ్యత తీసుకుని  ఇప్పుడు ఇజ్రాయిల్ దేశం గురించి అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈనేపథ్యంలో కరోనా వైరస్ అరికట్టాలంటే కచ్చితంగా రోగులకు సంబంధించిన మనుషులు పర్యవేక్షణ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కరోనా వైరస్ బారిన పడిన ప్రతి వ్యక్తి ఏయే ప్రాంతాలలో పర్యటించాడు మరియు ఎవరెవరిని కలిశారు అనేది తెలుసుకుంటే కచ్చితంగా వైరస్ ని ఈజీగా కట్టడి చేయవచ్చు.

 

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులపై నిఘా పెట్టేందుకు ఏకంగా ఉగ్రవాద వ్యతిరేక టెక్నాలజీని రంగంలోకి దింపింది. డిజిటల్ సాంకేతికత ద్వారా వీరిపై నజర్ పెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. కరోనాను అదృశ్య శత్రువుగా ఆయన అభివర్ణించారు. దేశం దానితో యుద్ధంలో ఉందన్నారు. క్వారంటైన్‌లో ఉన్న రోగులపై నిఘా పెట్టేందుకు ఉగ్రవాద వ్యతిరేక టెక్నాలజీ వినియోగించేందుకు అనుమతి ఇస్తున్నట్టు ఆయన ఇటీవల ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: