ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరోసారి తన కొత్త పలుకులో జనంపై విరుచుకుపడ్డారు. " అసలు ఎవరైనా జగన్ లాంటి రౌడీని సీఎంగా ఎన్నుకుంటారా.. అసలు ఈ ప్రజలకు బుద్ధుందా.. ఇంకేం చేసుకున్నవాడికి చేసుకున్నంత.. కోరి తెచ్చుకున్నారుగా.. కుర్ర సీఎం ను అనుభవించి చావండి.. అయినా మీకు ఇలాగే కావాలిలే.. మా చంద్రబాబును సీఎం కుర్చీ నుంచి దింపేస్తారా.. మీకు తగిన శాస్తి జరిగింది..:” పదాలు కాస్త తేడాగా ఉన్నా ఆదివారం కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట ఆదివారం చేసే కామెడీ ఇలాగే ఉంది.

 

 

ఈ మాట చెప్పేందుకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన లబ్ధప్రతిష్ఠ నేత జాన్‌ ఎఫ్‌.కెన్నడీ అన్న మాటలను మరీ ఉదహరించారు. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితిని చూసినవారికి గుర్తుకు వస్తే తప్పు పట్టాల్సింది ఏమీ లేదన్నారు. ఇంతకీ కెన్నడీ ఏమన్నారో తెలుసా.. అదీ ఆర్కే రాశారు.. “

‘‘దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం అవినీతి రాజకీయ నాయకులు కాదు.. వారిని ఎన్నుకున్న ప్రజలు సరిగా లేకపోవడమే ’’ ఇదీ కెన్నడీ చెప్పింది. చివరకు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపైనే ఉందని ఒక్క ముక్కలో తేల్చి పారేశారు.

 

 

ఆంధ్రప్రదేశ్ లో రోజూ అరాచకం జరిగిపోతోంది.. ఇదేం పాలన.. రోజూ ఐపీఎస్ లు, ఐ ఏ ఎస్ లు వెళ్లి కోర్టు ముందు చేతులు కట్టుకుని నిల్చుంటున్నారు. అధికార పార్టీ మరీ ఘోరంగా రెచ్చిపోతోంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. అసలు ఏపీ మరీ దారుణం.. ఆ బీహారే కాస్త నయం.. ఆ రాష్ట్రం కూడా ఇప్పుడు బాగు పడుతోంది.. కానీ ఏమీ మరీ దరిద్రంగా తయారైంది. ఇందుకు ఏపీ జనమే పరోక్షంగా కారణం అంటూ రెచ్చిపోయారు రాధాకృష్ణ.

 

 

రాధాకృష్ణ ఇంకా ఏమన్నారంటే.. “ స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరిస్తున్న విధానాన్ని మున్ముందు సాధారణ ఎన్నికలలో కూడా అనుసరించాలని కోరుకోరా? అందుకే కాబోలు 30 సంవత్సరాలపాటు అధికారం మాదే అని వైసీపీ నాయకులు విర్రవీగుతున్నారు. ‘కాకిలా కలకాలం ఉండే బదులు హంసలా ఆరు నెలలు బతికినా చాలు’ అని పెద్దలు అంటూ ఉంటారు. జనరంజక పాలన ఎంత కాలమైనా ప్రజలు స్వాగతిస్తారు. మద్దతిస్తారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎంతో కాలం పాలించలేరు. ఎంతో మంది నియంతలను చరిత్రలో చూశాం. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత స్థానిక సంస్థలన్నింటినీ అధికార పార్టీ తన ఖాతాలో వేసుకున్నా ప్రజల మద్దతుతోనే విజయం సాధించామని గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా? .. అంటూ నిలదీశారు ఆంధ్రజ్యోతి ఆర్కే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: