ఏపీ రాష్ట్రం విభజన తరువాత దారుణంగా ఇబ్బందులో పడింది. దాదాపుగా లక్ష కోట్ల అప్పుతో ఏపీ విభజనతో వేరుపడింది. ఇక అయిదేళ్ళ పాటు చంద్రబాబు పాలనలో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి మరీ భారం మోపారు మరో వైపు చూస్తే కేంద్రం అసలు నిధులు ఇవ్వదు. ఇచ్చినా అరకొర నిధులే.

 

దాంతో రాజ్యాంగబధ్ధంగా ఏపీకి రావాల్సిన అయిదు వేల కోట్ల నిధులు స్థానిక ఎన్నికలు జరిగితే వస్తాయి. కానీ ఆ నిధులు  ఏపీ ప్రజల బాగు గురించి ఎవరికీ అక్కరలేదు. ఎంతసేపూ రాజకీయం, తాము పై చేయిగా ఉండాలన్న  యావ తప్ప మరోటి కాదు. ఈ కారణంగానే చంద్రబాబు తన హయాంలో స్థానిక ఎన్నికలను జరిపించలేకపోయారు.

 

ఇపుడు గడువులోగా ఎన్నికలు పెట్టకపోతే నిధులు రావని తెలిసినా బాబు అండ్ కో కోర్టులకెక్కారు. వాయిదాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయినా ప్రభుత్వం ఎన్నికలకే ముందుకు వెళ్ళింది. కానీ చంద్రబాబు మాత్రం వ్యవస్థలను మరో మారు మ్యానేజ్ చేసి మరీ ఎన్నికలను ఆపించేశారు. ఇది పూర్తిగా బాబు కుట్రేనని జగన్ ఆరోపిస్తున్నారు.

 

తాను ఉన్నపుడు ఎన్నికలు పెట్టక, ఇపుడు కూడా పెట్టించక బాబు లాంటి సీనియర్ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు. వేల కోట్ల నష్టం తెస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారు అంటే ఆయన రాజకీయం ఇపుడు ప్రమాదంలో పడింది కాబట్టి. తన పార్టీ గ్రాఫ్  లోకల్ ఎన్నికల ఫలితాలు వెల్ల‌డైతే పాతాళానికి పడిపోతుందని బాబు ఇలా చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

 

సరే ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేతలంతా కేంద్రాన్ని ఒప్పించి అయిదు వేల కోట్లు నిధులు వెనక్కి రప్పించగలరా. అంటే అది ఉత్త మాటే. అది జరిగే పని కాదు. నష్టం చేయడమే వచ్చు తప్ప లాభం చేసే తీరిక ఓపికా ఈ నేతాశ్రీలకు  ఎక్కడిదీ. పేద రాష్ట్రం, కుదేలు అయిన ఏపీకి ఇలా గట్టి దెబ్బ తీస్తూ తమ రాజకీయమే పరమావధి అనుకుంటున్న వారి నుంచి ఈ ప్రజలు ఎక్కువగా ఆశిస్తున్నారా. లేక   బుద్ధి చెప్పినా కూడా వారే జనాలను కసితో కోపంతో వేధిస్తున్నారా. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: