భారత దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ విషమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రజలందరూ చిగురుటాకులా వణికిపోతారు. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే తాజాగా కరోనా  వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై జగన్మోహన్ రెడ్డి కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తాజాగా ఈ అంశంపైనా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓవైపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరోవైపు కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి పై  ఆందోళన చెందుతుంటే... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి  మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి అని నిరాశతో ఉన్నారు అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. 

 


 అయితే రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష కూడా నిర్వహించలేదని కనీసం ఒక్క ప్రెస్ మీట్  కూడా పెట్టలేదు అని విమర్శించారు. అంతేకాకుండా కరోనా  వైరస్ సోకితే కేవలం 60 ఏళ్ల పైబడిన వారు మాత్రమే చనిపోతారు అంటూ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం... సీఎం జగన్మోహన్ రెడ్డి  అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అంటూ విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల్లో మాట మార్చి తమ రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు  కోసం... మొత్తం విద్యా సంస్థలను,  సినిమా హాళ్లను,  షాపింగ్ మాల్స్ ని బంద్ చేశారు అని... కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇలాంటి నిబంధనలు కొనసాగుతున్నాయని ఇదంతా జగన్ గమనించాలని  చంద్రబాబు తెలిపారు. 

 

 కానీ క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మాత్రం ... ఆంధ్రప్రదేశ్ లో  రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం 60 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే కరోనా వస్తుందని ఆయన వ్యాఖ్యానించడం అవగాహన రాహిత్యం అంటూ మండిపడ్డారు. కెనడా ప్రధాని భార్యకు సైతం కరోనా  వైరస్ సోకిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గమనించాలని సూచించారు. కనీసం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సీఎం కేసీఆర్ ని చూసి తెలుసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: