ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు చేరువవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇక ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీ మధ్య అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసిపి అటు టీడీపీ కూడా ఎక్కువ అవకాశం కల్పించకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుని ఉండడంతో.. వైసీపీకి అటు టీడీపీ నుంచి కూడా గట్టి పోటీ తగలడం లేదు అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ పార్టీ  రోల్  ఏమిటి అనే దానిపై రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. 

 


 ఆంధ్ర రాజకీయాల్లో  ఎక్కడో మూలన ఉన్న బిజెపి పార్టీ మొన్నటి  అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి బలం లేకుండా ఎంతగానో పోరాడింది. ముఖ్యంగా బలమైన నాయకులు ఉన్నటువంటి చోట అధికార ప్రతిపక్ష పార్టీకి  ఎదురుగా ఎంతగానో పోరాడింది బీజేపీ పార్టీ. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయగలిగిన సామర్థ్యం అయితే బీజేపీ ఇప్పటివరకు సంపాదించలేదు. ఇక ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు లక్షల పదవులకు జరుగుతున్న పోటీలో తాము కూడా ఎక్కడ ఏ పార్టీకి తీసుకుపోలేదు అనే విధంగా నిలబడేందుకు ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. కొన్ని చోట్ల అధికారపక్షం నుంచి నామినేషన్లు వేయకుండా పోటీచేయకుండా దాడులు జరిగినా ఎదిరించి నిలబడటం  హర్షించదగ్గ విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 


 శ్రీకాళహస్తి లో అధికార పార్టీ నేతలు నామినేషన్లు వేయకుండా ఎదుర్కొన్నప్పటికీ బిజెపి పార్టీ మాత్రం పోటీ చేస్తుంది. ఇక కొన్ని కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ వర్గాలు బిజెపి నాయకులను నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా... భారతీయ జనతా పార్టీలో కూడా పోరాడే కార్యకర్తలు ఉన్నారని నిరూపించేందుకు అధికార పార్టీని సైతం ఎదిరించి పోరాడుతుంది బీజేపీ. బిజెపి కేవలం పోటీ కి నాలుగు ఓట్లు వస్తే చాలు అనుకుంటుంది అని ప్రజలు అనుకుంటున్న దగ్గర నుండి .. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు దాడులు జరిపిన కూడా మళ్లీ మళ్లీ నామినేషన్లు వేస్తున్నాం అనే విధంగా రాష్ట్రంలో కొంత మంది బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు. 

 


ముఖ్యంగా అధిష్టానంపై  మీద స్థానిక నేతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు ఎందుకంటే ఆంధ్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం ఎప్పటికప్పుడు గవర్నర్ కు,  ఎన్నికల సంఘానికి, కేంద్రానికి కంప్లైంట్ లు ఇస్తూ ఉండడం జరుగుతుంది. ఈ ధైర్యం తోనే స్థానిక  క్యాడర్ కూడా ధైర్యంగా నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇంత ధైర్యంగా నిలబడడమే కాదు దాన్ని ప్రజల నుంచి ఓట్లుగా మార్చుకుంటుందా లేదా  అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: