రాజ్యసభ ఎన్నికల్లో  వైసిపి తరపున నామినేషన్ వేసిన నలుగురిలో  కీలక వ్యక్తి పరిమళ్ ధీరజ్ నత్వాని అనే చెప్పాలి. ఇప్పటికి రెండుసార్లు రాజ్యసభలో ఇండిపెండెంట్ వ్యవహరిస్తున్న నత్వాని ఇకనుండి వైసిపి ఎంపిగా ఉంటారు. ఈ ఎంపి ఎంతటి కీలక వ్యక్తంటే ఇటు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి అటు నరేంద్రమోడి, అమిత్ షా కు మధ్య  బ్రిడ్జి లాంటోడున్న విషయం చాలామందికి తెలీదు. అంటే పై ముగ్గురికి నత్వానా చా.....లా ఇష్టుడన్న మాట.

 

అలాంటి నత్వాని  ఇపుడు వైసిపి ఎంపి అయ్యాడు. అంటే ఈ ఎంపి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎంతటి కీలక వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి నత్వానీ ఇప్పటి నుండి జగన్ కు పై ముగ్గురు వ్యక్తులకు దాదాపుగా హాట్ లైన్ లాగ మారిపోబోతున్నాడనే చెప్పాలి. మామూలుగా అయితే ప్రధానమంత్రితో కానీ అమిత్ షా తో కానీ లేకపోతే ముఖేష్ తో కూడా కావచ్చు జగన్  మాట్లాడాలని అనుకుంటే సాధ్యం అయ్యేది కాదు.

 

ఎందుకంటే పై ముగ్గురు వ్యక్తుల్లో నరేంద్రమోడి, అమిత్ షా కు అవసరం అనుకుంటేనే ఎవరితో అయినా మాట్లాడుతారు.  జగన్ ఎన్నిసార్లు అపాయిట్మెంట్ కావాలని అడిగానా మోడి, షా ఇవ్వని విషయం అందరికీ తెలిసిందే. సరే ముఖేష్ తో మాట్లాడే అవసరం జగన్ కు పెద్దగా ఉండదనే అనుకోవాలి. కానీ మారిన పరిస్ధితుల్లో అంటే పై ముగ్గిరికి బాగా ఇష్టుడైన నత్వానికి జగన్ పార్టి తరపున ఎంపిని చేయటమంటే మామూలు విషయం కాదు.

 

ఇపుడు పై ముగ్గురితో జగన్ కు ఏపని ఉన్నా అది వ్యక్తిగతం కావచ్చు లేదా రాష్ట్రాభివృద్ధికి సంబంధించినది కూడా కావచ్చు. పై ముగ్గరితో జగన్ తరపున మాట్లాడేందుకు నత్వానీ ఉపయోగపడతాడనటంలో సందేహం లేదు. మాట్లాడేందుకు నత్వాని ఫోన్ చేస్తే పై ముగ్గురు కాదనే పరిస్ధితి లేదు. సర్వకాల సర్వావస్ధల్లో ఎప్పుడైనా నత్వాని పై ముగ్గరితోను నేరుగా మాట్లాడగలడు. అందుకనే పై ముగ్గురితో మాట్లాడేందుకు జగన్ తరపున నత్వాని హాట్ లైన్ లాగ అయిపోతాడనటంలో సందేహమే లేదు. మరి ఈ హాట్ లైన్ వల్ల పార్టీకి కానీ ఏపికి గానీ ఏమాత్రం ఉపయోగమో భవిష్యత్తే తేల్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: