ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకున్న  విషయం తెలిసిందే. అధికార విపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇక అక్కడక్కడా అధికార పార్టీ ప్రతిపక్ష టీడీపీ పార్టీపై కాస్త దాడులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మునుపెన్నడూ ఆంధ్ర రాజకీయాల్లో  లేని విధంగా బయోత్పాతాలకు  గురు చేస్తున్నారు అధికార పార్టీ వర్గీయులు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు 2014 -19మధ్యలో వచ్చి ఉంటే.. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న టిడిపి పార్టీ 70% విజయాన్ని అందుకునేది  అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువగా విజయం వరిస్తుంది అన్న విషయం తెలిసిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఉంటే టీడీపీ ఘన విజయం సాధించేదని.. కానీ ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటం.. సరి కొత్త నిబంధనలు తెరమీదికి వస్తుండటం.. అంతేకాకుండా అక్కడక్కడ నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలు జరుగుతుండటం వల్ల టిడిపి వెనుకబడిపోయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 


 అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలా ఉన్నప్పటికీ కార్పొరేషన్ ఎన్నికల ఓటర్ల ఆలోచన విధానం మాత్రం వేరు ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అటు తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు కైవసం చేసుకున్న టిఆర్ఎస్ పార్టీ... కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేసరికి బిజెపి గట్టి షాక్ ఇచ్చింది. మరి భారీ మొత్తంలో కాకుండా విజయంలో  కాస్త తేడా మాత్రం కనిపించింది. అయితే ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కూడా గట్టి పోటీ అనేది కార్పోరేషన్ లో ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విశాఖపట్టణం విజయవాడ విజయనగరం కాకుండా భీమవరం ఏలూరు ఇలాంటి కార్పొరేషన్లలో కూడా గట్టి పోటీ ఉండబోతుందని అంటున్నారు. 

 


 అయితే ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంటుందో అక్కడ ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నికలకు ఆపేసింది ఎక్కడైతే బలంగా వైసీపీ  ఉంటుందో అక్కడ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో మాత్రం అధికారపక్షం సులభంగా ఘన విజయం సాధించేలాగా కనపడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే రాయలసీమలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే నాయకులు ప్రతిపక్ష పార్టీకి దొరకడం లేదు. కానీ కోస్తా,  ఉత్తరాంధ్ర లో మాత్రం బలమైన పోటీ కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయా కార్పొరేషన్లలో అధికారపక్షం గెలవడం అనుమానమే అంటున్నారు. ఒకవేళ ప్రస్తుతం చేస్తున్నట్లుగా నామినేషన్ల ఉపసంహరణ జరగడం లాంటివి జరిగితే తప్ప అధికార పార్టీ గెలవడం మాత్రం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: