కరోనా .. ఈ పేరు వినగ్గానే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి గడగడా లాడిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోగులను ప్రత్యేక వార్డులలో ఉంచి చికిత్స ను అందిస్తున్నారు.భారత దేశంలో కూడా కరోనా ఇప్పుడిప్పుడే పంజా విసరడం ఆరంభించింది. తెలంగాణతో సహా మిగిలిన రాష్ట్రాల్లో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతున్నారు.

 

 

 

ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు.ఈ కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న రోగులను నెగిటివ్ వచ్చేవరకు వైద్యులు పరివేక్షణలో ఉంచారు. ఇది ఇలా ఉండగా మరోపక్క రాష్ట్రాల్లో విద్య సంస్థలు , సినిమా హాళ్లు ఎక్కిక్కడ మూసివేసినట్లు తెలుస్తుంది. అయితే కరోనా భయం కన్నా విద్యార్థులలో సెలవులు దొరికాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చిలో జరగనున్న పలు పరీక్షలు వాయిదా పడినట్లు ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. 

 

 

 

అంతేకాకుండా తాజాగా కరోనా ప్రభావం తిరుమల శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పై కూడా పడింది. తిరుమలలో హై అలెర్ట్ ప్రకటించింది టీటీడీ. వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, తదితర ప్రత్యేక పూజలు తాత్కాలికంగా రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. క్యూ కాంప్లెక్స్ లో భక్తులు వేచి ఉండకుండా దర్శనం చేసుకునేట్టు ఏర్పాట్లు చేస్తుంది. గంటకు నాలుగు వేళ మంది మాత్రమే దర్శనం చేసుకునే విధంగా ఉండాలని టీటీడీ నిర్ణయించింది.

 

 

 

ఈ మేరకు మార్చి 19 నుంచి 21 వరకు ధన్వంతరి మాహాయాగం నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి భక్తులంతా టోకెన్ తీసుకున్నాకే దర్శనం ఉంటుందని టీటీడీ నిర్ణయం తీసుకుంది.సీతారాముల కళ్యాణం రద్దు చేసి, లైవ్ ద్వరా కళ్యాణం వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మంగళవారం నుంచి టీటీడీ కేటాయించే సమయంలో మాత్రమే దర్శనానికి రావాలిఅని టీటీడీ పేర్కొంది.ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని టీటీడీ విన్నవించింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: