ఏపీలో స్టేట్ ఎన్నికల కమిషన్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది. ఆరు వారాల పాటు ప్రక్రియను నిలిపేసింది. దీంతో ఈనెలాఖరు నాటికి ఈ ఎన్నికలను పూర్తి చేయడం కుదరదు. ఆరు వారాలు అంటే నెలన్నర.. అంటే.. మేలో మళ్లీ ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

 

 

కానీ స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. ఏపీ దాదాపు 5000 కోట్ల రూపాయలు నష్టపోతుందని సీఎం జగన్ అంటున్నారు. ఎందుకంటే.. మార్చి 31లోపు ఎన్నికలు అయితే, 14వ ఆర్థిక కమీషన్ నిధులు దాదాపుగా 5000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. ఎన్నికలు జరక్కపోతే ఆ డబ్బులు రావు. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఆ నిధులు వస్తే ఏపీకి చాలా ఆసరాగా ఉంటుంది.

 

 

అయితే కేవలం చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఎన్నిక కాలేదనే కోపంతో నిమ్మగడ్డ ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తున్నారని జగన్ అంటున్నారు. నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం వల్ల ఏపీలో కరోనా దీనివల్ల పరిస్థితి మెరుగౌతుందా? పరిస్థితి ఇంకా ఎక్కువౌతుంది కానీ తగ్గదు కదా. ఎలక్షన్లు దీన్ని అడ్డుపెట్టుకుని ఆపడం వల్ల ఏం లాభం. ఒకపక్క కరోనాపై పోరాడుతూ మన పని మనం చేసుకుంటూ పోవాలి. మన నిధులు రావడం క్వశ్చన్ మార్కు పడింది. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి వస్తే, ఎన్నికలు ఆగిపోతే మరో 5000 కోట్లు ఆగిపోవడమేనా. బాధ్యతగల స్థానంలో ఉన్న వ్యక్తులు దీన్ని ఆలోచించద్దా.. అని జగన్ అన్నారు.

 

 

" ఎన్నికలు ఒక ప్రక్రియ ప్రజాస్వామ్యంలో. వాటిని పూర్తి చేస్తే అభివృద్ధి ముందడుగు వేస్తుంది. అది జరగకూడదు, మేం అధికారం చెలాయించాలని కోరుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలు ఆపేయించి ఎవరు అన్యాయం చేస్తున్నారు? ప్రజలకు మంచి చేస్తున్నారా కీడు చేస్తున్నారా? ఇది ఇలాగే చూస్తూ ఊరుకోం. దీనిపై గవర్నర్ కి కంప్లైంట్ చేసాం. ఆయనలో మార్పు రావాలని ఆశిస్తున్నాం. దీన్ని పై స్థానంలోకి తీసుకుపోయి ఈ మనుషులు చేస్తున్న పనులను ఎక్స్ పోజ్ చేయబోతున్నాం అన్నారు సీఎం జగన్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: