ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రమాదకరమని చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు. అయితే.. దీనిని నివారించాలంటే చేతులు కడుక్కోవాలని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ వైరస్ ప్రమాదకరమైనదని మనకు తెలుసు. మామూలుగా బయటికి వెళ్ళి వచ్చాక చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి అని చెప్తుంటారు. కానీ.. కొంతమంది ఆకతాయిలు చేతులు కడుక్కొకపోతే ఏమవుతుంది అని నిర్లక్ష్యంగా ఉంటారు. అలా అనే వారికి ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే అని అంటున్నారు. 

 

 


కొంతమంది డాక్టర్లు చెప్పిన లాగానే సబ్బు పెట్టి కడుక్కుంటున్నారు. కానీ.. కొంతమంది మాత్రం ఏముందిలే సబ్బు పెట్టి కడుక్కుంటే మాత్రం  పోతుందా.. అంటూ పట్టించుకోకుండా ఉంటున్నారు. హ్యాండ్ శానిటైజర్లను కూడా వాడుతున్నాం. ఇప్పటికీ కూడా కొంత మందికి డౌట్ ఉంటోంది. హ్యాండ్ శానిటైజర్లు, సబ్బులు వాడినంత మాత్రాన వైరస్ మనకు సోకకుండా ఉంటుందా.. అంటూ వెటకారంగా అంటుంటారు కొందరు. అనవసరంగా డబ్బులు వేస్ట్ అని అనుకుంటున్నారు. ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే .. అసలు వాళ్ళు సబ్బుతో తప్పనిసరిగా కడుక్కోవాలని తల్లిదండ్రులు చెబితే కొంతమంది ఏడుస్తారు.  అయితే.. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ రోజుల్లో ఓ విదేశీ టీచర్ అమందా లోరెంజో కరోనా వైరస్ రాకుండా ఏం చెయ్యాలో ఓ అద్భుతమైన వీడియోను చేసి చూపించారు.

 


మొదట ఓ ప్లేటులో నీరు పోసి ఆ నీళ్ళలో మిరియాల పొడిని అందులో పోశారు. ఆ తర్వాత ఆ టీచర్ వేలును నీటిలో పెట్టారు. అలా ఆమె వేలు పెట్టినప్పుడు మిరియాల పొడి ఆమె వేలు చుట్టూ మిరియాల పొడి ఉంది. ఆ తర్వాత ఆమె వేలిని నూనెలో పెట్టారు. ఇక్కడ నూనెకు బదులు సోప్ క్రీమ్ అని చెప్పారు. ఆమె ఆ వేలిని తిరిగి మిరియాల పొడి ఉన్న నీటిలో పెట్టారు. దీంతో అక్కడున్న మిరియాల పొడి మొత్తం క్షణాల్లో దూరంగా పోయింది. దీన్ని టీచర్ చూపించి వైరస్‌ లు కూడా సబ్బు రాసుకుంటే ఇలాగే దూరంగా పారిపోతాయని ఆమె చెప్పారు. ఈ వీడియో చూసిన పిల్లలు షాక్ అయ్యారు. సబ్బు చేతులకు రాసుకోవడం వల్ల, చేతుల్ని సబ్బుతో కడుక్కోవడం వల్ల ఎంత లాభమో కళ్లారా చూసి తెలుసుకున్నారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది.


.

మరింత సమాచారం తెలుసుకోండి: