జగన్ చూపు ఎపుడూ బాబు వైపు ఉంటోంది. బాబు అన్నీ చేశాడని అంటారు. నిజానికి బాబు జగన్ విషయం వస్తే అర క్షణం అయినా ఆగరు. చేయాల్సింది చేస్తారు. అటువంటి రాజకీయం ఆ ఇద్దరిదీ. ఇకపోతే లోకల్ బాడీ ఎన్నికల వాయిదా విషయంలో బాబు హ్యాండ్ ఉందని జగన్ అంటే  అంతా నమ్ముతున్నారు.

 

కానీ బాబుతో పాటు కేంద్రం హ్యాండ్ కూడా  ఉందని మరో ప్రచారం ఉంది. ఏపీలో కనీసం ఉనికి లేకుండా పడి ఉన్న బీజేపీ జనసేనతో జతకట్టింది. రెండు పార్టీలూ కలసి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏదో రకమైన ఉపయోగం పొందుదామనుకున్నాయి. అయితే వైసీపీ అతి ఉత్సాహంలో టీడీపీతో పాటు ఇతర పార్టీలను వదలలేదు.

 

ముఖ్యంగా బీజేపీ విషయంలో కాస్తా లౌక్యం ప్రదర్శించి చూసీ చూడకుండా ఉంటే ఇపుడు ఎన్నికలు వాయిదా పడేవి కావు. కానీ ఏకగ్రీవాల కోసం వైసీపీ నేతలు చాలా చోట్ల బీజేపీ వారిని కూడా బెదిరించేసారు. దాంతో కమలధారులకు మండుకొచ్చింది.

 

ఏపీ బీజేపీ అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ జగన్ మీదా ఆడిపోసుకుంటే ఒకే. కానీ కేంద్ర ప్రభుత్వంలో మంచి పలుకుబడి కలిగిన జీవీఎల్ నరసింహారావు వంటి వారు కూడా బీజేపీకి ఏపీలో పొలిటికల్ గా  ఏమీ లేకుండా పోవడాన్ని సహించలేకపోయారు. ఏపీలో బీజేపీ నేతలపైన దాడులు జరుగుతున్నాయని ఒకటికి పదిసార్లు వారు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు.

 

కానీ వైసీపీ నేతలు ఎక్కడా సర్దుకోలేదు. దాంతో వారంతా వెళ్ళి కేంద్ర హోం మంత్రిని ఫిర్యాదు చేశారని టాక్. అంతే కాదు, ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు లేఖ కూడా రాశారు. ఈ మొత్తం పరిణామాలు చూసినపుడు కేంద్రం కూడా ఏపీ లోకల్ బాడీ ఎన్నికల పట్ల సీరియస్ గా ఉందని అర్ధమవుతోంది. 

 

మరో వైపు కరోనా వైరస్ కూడా ఒక కారణంగా ఉండంతో అన్నీ కలసి వచ్చి ఇలా వాయిదాకు దారితీశాయనుకోవాలి. మరి జగన్ ఈ విషయంలో తన పార్టీ నేతలను కాస్తా కంట్రోల్లో పెట్టుకుని ఉంటే ఇంత బాధ ఉండేది కాదని అంటున్నారు. ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఇదే విషయం చెబుతున్నారు. కేంద్రం ఆదేశాలతోనే తాను ఇలా చేశానని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: