ఏపీ సీఎం జగన్ స్థానిక ఎన్నికల వాయిదా పై తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కులానికే చెందిన నిమ్మగడ్డ చంద్రబాబుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని రాష్ట్రానికి తీవ్ర హాని చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. తనకు ఉద్యోగం ఇచ్చిన చంద్రబాబుపై నిమ్మగడ్డ ఇలా కృతజ్ఞత తీర్చుకున్నారని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చారు.

 

 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాద్యతారాహిత్యంగా మాట్లాడారని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎన్నికల వాయిదా వేయడాన్ని చంద్రబాబు సమర్థించారు. చంద్రబాబు ఆసాంతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాట్లాడారు. ఓవైపు ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోందని.. ఇలాంటి సమయంలో జగన్ మాత్రం ఎన్నికలంటూ కలవరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కులం పేరుతో నిమ్మగడ్డపై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు.

 

 

కరోనా వైరస్ పెరిగితే దేశానికి ఏమి అవుతుందో జగన్ ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై హెచ్చరికలు చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు. జర్మనీ దేశంలో డెబ్బై శాతం మందికి సోకిందని ఛాన్సలర్ చెప్పారని చంద్రబాబు అంటున్నారు. అంతే కాదు.. అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తదితర అంశాలను చంద్రబాబు వివరించారు.

 

 

కరోనా పై భారత ప్రభుత్వం కూడా జాతీయ విపత్తుగా ప్రకటించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇదే సమయంలో జగన్ వైఖరిని చంద్రబాబు విమర్శించారు. జగన్ తీరు అంతేనని.. ఆయన ఎవరు చెప్పినా వినరనడానికి ఇదే ఉదాహరణ అంటూ చంద్రబాబు విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: