కరోనా వినగ్గానే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి గడగడా లాడిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోగులను ప్రత్యేక వార్డులలో ఉంచి చికిత్స ను అందిస్తున్నారు.భారత దేశంలో కూడా కరోనా దాని ప్రభావాన్ని చూపుతుంది. తెలంగాణతో సహా మిగిలిన రాష్ట్రాల్లో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతున్నారు.

 

 

 

 

ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు.ఈ కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న రోగులను నెగిటివ్ వచ్చేవరకు వైద్యులు పరివేక్షణలో ఉంచారు. ఇది ఇలా ఉండగా మరోపక్క రాష్ట్రాల్లో విద్య సంస్థలు , సినిమా హాళ్లు ఎక్కిక్కడ మూసివేసినట్లు తెలుస్తుంది. అయితే కరోనా భయం కన్నా విద్యార్థులలో సెలవులు దొరికాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చిలో జరగనున్న పలు పరీక్షలు వాయిదా పడినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి.. 

 

 

 

 

దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31 వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, 31 తర్వాత పెళ్లిళ్లకు కూడా అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. స్కూళ్ల మూసివేత విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 

 

 

 

 


ఇక, ఇప్పటి వరకు నిర్ణయమైన పెళ్లిళ్లకు మాత్రమే అనుమతి ఇస్తామని, 31వ తేదీ వరకు మాత్రమే వివాహ మండపాలు తెరిచి ఉంచుతామని పేర్కొంది. ఆ తర్వాత పెళ్లిళ్లకు అనుమతించబోమని స్పష్టం చేసింది. అంతేకాదు, పెళ్లికి హాజరయ్యే అతిథులు 200 మందికి మించకూడదని ఆంక్షలు విధించింది. ఈ నెల 31 తర్వాత మ్యారేజ్ హాల్స్‌కు కూడా అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ చరియలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలని తేల్చి చెప్పింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: