పంచభూతాల సాక్షిగా మూడుముళ్లతో ఏకమైన బంధం మరణించే వరకు విడిపోదంటారు.. కానే నేటికాలం పెళ్లిలు మూడునెలల వరకు కూడా ఆగడం లేదు.. అప్పుడే గొడవలు, అనుమానాలు. ఆ తర్వాత విడిపోవడాలు లేదంటే చచ్చిపోవడం జరుగుతున్నాయి.. వేదమంత్రాలను పాడెకు కట్టే తాళ్లలా భావిస్తున్నారు.. పెళ్లంటే గుండెల మీద బరువు, పడకలో మాత్రం లభించే సుఖంలా భావిస్తున్నారు..

 

 

ఇకపోతే ఓ సైకో భర్త వల్ల అతని భార్య వేదన భరించే ఓపిక లేక ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన తెలుసుకుంటే అయ్యో పాపం అనిపిస్తుంది.. అన్ని వేళలా అండగా ఉంటానని అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణాలు మరచిన ఆ భర్త అతని భార్య అనారోగ్యానికి గురైతే వేధించి మానసికంగా చంపడమే కాదు.. ఆమె ఈ లోకాన్ని విడిచిపోయేలా హింసించాడట.. ఇక ఈసైకో భర్త పేరు ధర్మానంద శర్మ.. బెంగళూరులోని మంజునాధ నగర్‌లో నివాసం ఉండే కృష్ణ కుమార్, శరావతి దంపతుల కుమారుడే ఈ ధర్మానంద శర్మ..

 

 

ఇతనికి, లక్ష్మీ శర్మ అనే యువతితో వివాహమైంది. అయితే కొద్దికాలానికే ఆమెకి గుండెజబ్బు ఉన్నట్లు తెలియడంతో పిసినారి భర్త.. ఆమె అత్త మామ ఆస్పత్రి ఖర్చులు పెట్టుకునేందుకు నిరాకరించారు. పుట్టింటి నుంచే ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఎంతో వేధన చెందిన ఆ అమ్మాయి.. భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్థాపానికి గురై అఘాయిత్యానికి పాల్పడింది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 

 

చనిపోయే ముందు అత్తింటి వేధింపులతోనే తాను చనిపోతున్నానని.. విడాకులు ఇవ్వాలంటూ తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. దీంతో భర్త, సహా అత్తమామాలను పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపారు.. ఇక ఈ సైకో ఫ్యామిలీ వల్ల పాపం నూరేళ్ల జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించిన లక్ష్మీ మరణం పట్ల ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: