ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని ఒక్కసారిగా ఆంధ్ర రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకస్మాత్తుగా ఎన్నికల సంఘం ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది . అయితే దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఏపీలో ఎన్నికల వాయిదాకు గల కారణం పై తెలంగాణ ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా  వైరస్ ను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిందని... ఈ విషయంపై జాతీయస్థాయి ప్రతినిధులతో చర్చించిన తర్వాతనే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం ఎంతో విచారకరమన్నారు. అయితే తనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేసిన  నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే అటు భారతదేశంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తక్షణమే స్థానిక సంస్థల  ఎన్నికలు ప్రారంభిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. అయితే ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్  అమలులో ఉంటుంది అంటూ తెలిపిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్... పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కూడా ఎన్నికల నియమావళి కిందికే వస్తుంది అంటూ తెలిపారు. 

 

 

 అయితే ప్రస్తుతం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా మాత్రమే వేశామని.. ఎన్నికలను  పూర్తిగా రద్దు మాత్రం చేయలేదు అంటూ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న హింస పై వివిధ పార్టీలు తమ దృష్టికి తీసుకు వచ్చాయి అంటూ తెలిపిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్... హైకోర్టు జడ్జికి  ఉండే అధికారాలన్నీ ఎన్నికల కమిషనర్ కు కూడా ఉంటాయి అంటూ  గుర్తు చేశారు. అయితే రాజ్యాంగబద్ధ ఎన్నికలను వాయిదా వేస్తే... దురుద్దేశంతో ఎన్నికలను వాయిదా వేశామని ఆపాదించడం తీవ్ర విచారకరం  అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: