తెలంగాణ రాష్ట్ర నూతన బిజెపి అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సాధారణ వ్యక్తికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం కేవలం భారతీయ జనతాపార్టీ కి మాత్రమే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా పనిచేసిన తాను పార్టీ బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని తనకు ఎంతో గౌరవంగా  ఉన్నది అని చెప్పుకొచ్చారు. తనకు పార్టీ బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు. ఇక పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారి బండి సంజయ్ హైదరాబాద్ రాగా  ఆయనకు మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర సీనియర్ నేతలు ఘనస్వాగతం పలికారు. 

 

 

 ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసారు.  రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. బీజేపీ ఏ మతం వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించిన బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. బిజెపి కార్యకర్తలు యువకులపై ఒక్క లాఠీ దెబ్బ పడిన  చూస్తూ ఊరుకోను అంటూ తెలిపారు బండి సంజయ్. ఎంఐఎం పార్టీ తో కలిసి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తుంది అంటూ మండిపడ్డారు బండి సంజయ్. తెలంగాణలో మరో పార్టీ అధికారంలోకి రావాల్సిందే అంటూ స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో టిఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెడుతున్న పథకాలు కోసం ఇచ్చే నిధులు కెసిఆర్ సొత్తు కాదని కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్రంలో తాము  ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 

 

 

 దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్య కోసం 15 శాతం పైగా నిధులు కేటాయిస్తోంటే... తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సార్ గారు మాత్రం రాష్ట్ర బడ్జెట్లో కేవలం ఏడు శాతం మాత్రమే నిధులు కేటాయించారు  అంటూ తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖను కేసీఆర్ సర్కార్  దారుణం చేసింది అంటూ మండి పడ్డారు. ప్రభుత్వం తప్పిదం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోయినప్పటికి కూడా సీఎం కేసీఆర్ ఎక్కడ స్పందించలేదని... ప్రజల బాగోగులు పట్టించుకోని ముఖ్యమంత్రి మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ నీకు కౌంట్ డౌన్ మొదలైంది రేపటి నుంచి యుద్ధమే అంటూ సవాల్ విసిరారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: