కేసీఆర్ సర్కారుతో యుద్ధం మొదలైందన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైందని... ప్రజాసమస్యలపై పోరాటంతో కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తామన్నారు. తమని బంధించాలంటే ఉన్న జైళ్లు సరిపోవని... కొత్తవి కట్టుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారి హైదరాబాద్ వచ్చిన సంజయ్.... నాంపల్లి బీజేపీ ఆఫీసు దగ్గర ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొన్నారు. trs, MIMల అహంకారాన్ని దెబ్బకొట్టడం బీజేపీతోనే సాధ్యమన్నారు సంజయ్. విద్యార్థుల బలిదానలతో అధికారాన్ని అనుభవిస్తున్న కేసీఆర్ కు... ఇవాళ వారి త్యాగాలు కనిపించడం లేదన్నారు. 

 

 

trs, mim ల కుటుంబ పాలన పోవాలన్నారు బీజేపీ నేతలు.  సంజయ్ అధ్యక్షతన బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సామన్య కార్యకర్త అధ్యక్షుడు కావడం బీజేపీలోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ తల్లికొడుకుల పార్టీ అయితే, trs తండ్రికొడుకుల పార్టీ అని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం MIMకు గులాంగిరి చేస్తోందనీ.. తెలంగాణ కలలను సంజయ్ నిజం చేస్తారన్నారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ మోసాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలిస్తున్నారని విమర్శించారు.

 

 

పార్టీ అధ్యక్షుడిగా మొదటిసారి హైదరాబాద్ కు వచ్చిన బండి సంజయ్ కి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు సంజయ్. స్వాగతసభకు శాలువాలు, బొకేలు తేవొద్దని... ఆ డబ్బులను భైంసా బాధితులకు సాయం చేయాలని కోరారు. దీనికోసం సభదగ్గర హుండీని ఏర్పాటు చేశారు. సంజయ్ సూచనతో చాలా మంది నాయకులు, కార్యకర్తలు వంద నుంచి లక్షా దాకా హుండీలో డబ్బులు వేశారు. ఎంపీ అర్వింద్ ఐదు లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: