ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలాగైనా విశాఖపట్టణం మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్టణం రాజకీయాలను ముందు నుండి చూసుకుంటున్న విజయసాయి రెడ్డి కె ఈ బాధ్యతను కూడా అప్పగించడం జరిగింది. దీంతో విశాఖపట్టణం మేయర్ స్థానాన్ని ఏకగ్రీవం చేయటానికి విజయసాయిరెడ్డి లోకల్ లో ఉన్న వైసిపి కేడర్ ని అలర్ట్ చేశారు. ఇదే టైమ్ లో విజయసాయిరెడ్డి వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మామూలుగా అధికారంలో ఉన్న టైంలో చంద్రబాబు హయాంలో జగన్ సొంత జిల్లా కడపలో జరిగిన ఎన్నికలకు సంబంధించి చక్రం తిప్పి జగన్ సొంత ఇలాకాలో తెలుగుదేశం జెండా గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎగరవేశారు.

 

అయితే ఇప్పుడు అధికారం లేకపోవడం తో కొద్దిగా సైలెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా విశాఖపట్టణం మేయర్ పీఠం విషయంలో కింగ్ మేకర్ అవ్వాలని విజయసాయి రెడ్డి కి ఆపోజిట్ గా మరొకవైపు నుంచి నరుక్కొస్తున్నారు. పూర్తి విషయంలోకి వెళ్తే తన సొంత విశాఖ ఉత్తర స్థానంలో బిజెపి మరియు జనసేన కూటమి తో గంటా శ్రీనివాసరావు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక్కడ మొత్తం పదిహేడు వార్డులు ఉన్నాయి. ఇందులో బీజెపీకి, జనసేనలకు చెరో రెండు సీట్లు ఇవ్వడం ద్వారా వారిని మచ్చిక చేసుకుని వారి మద్దతుతో మిగిలిన సీట్లు గెలుచుకోవాలని గంటా శ్రీనివాసరావు చూస్తున్నారుట.

 

ఆ విధంగా ఏ టీడీపీ ఎమ్మెల్యే సాధించలేని విధంగా అత్యధిక కార్పోరేటర్లను గెలుచుకుని రేపటి మేయర్ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవతారం ఎత్తాలన్నది గంటా వ్యూహమని అంటున్నారు. దీంతో వైసీపీని దెబ్బతీయాలని ఏదో విధంగా అధికారికంగా చక్రం చెప్పాలని గంటా శ్రీనివాసరావు ఆలోచిస్తున్నారట. ముఖ్యంగా తన సొంత ఇలాకాలో అవంతి శ్రీనివాస్ చేస్తున్న రాజకీయానికి ఈ విధంగా చెక్ పెట్టాలని మేయర్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట గంటా శ్రీనివాస్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: