ప్రపంచం అంతా కరోనాను ఎలా ఎదుర్కోవాలని తర్జనభర్జన పడుతుంటే.. పాకిస్దాన్ మాత్రం గుంటనక్క వేషాలు వేస్తుందట.. అదెలా అంటే రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న కరోనాను అంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలని ప్రధాని మోదీ దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘానికి (సార్క్) సూచించారు. ఇందులో భాగంగా 10 మిలియన్‌ డాలర్లతో అత్యవసర నిధి ఏర్పాటుకు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్‌ను ఎదుర్కోవాలంటే మాత్రం ఐకమత్యంగా పోరాడితేనే ఇది సాధ్యమవుతుందని, ఏ ఒక్కరికి ఒంటరిగా సాధ్యం కాదని నొక్కి చెప్పారు.

 

 

ఇదంతా నిన్న సార్క్ దేశాల అధినేతలు, ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగిన సమయంలో ప్రస్తావనకు వచ్చింది.. ఇక కరోనా వైరస్ ఎదుర్కొనే అంశంపై ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీతో సహా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలీహ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలీ, భూటాన్ రాజు లోటే ట్షెరింగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అఫ్గానిస్థాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ, పాకిస్థాన్ ఆరోగ్యశాఖ తరపున ప్రత్యేక అసిస్టెంట్ జఫర్ మిర్జా మొదలగు వారు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

 

 

ఈ సందర్భంగా కరోనాను కట్టడి చేసే అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. సార్క్ దేశాలన్ని కరోనా గురించి చర్చిస్తుండగా పాకిస్దాన్ వంతు వచ్చింది.. కరోనా అనే ముఖ్యాంశం విషయంలో జరుగుతున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌లో పాకిస్థాన్ తన వక్ర బుద్ధిని మరోసారి బయట పెట్టింది. కరోనాను కట్టడి చేసే చర్యలను చర్చిస్తుండగా కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రత్యేక అసిస్టెంట్ జాఫర్ మీర్జా లేవనెత్తారు.

 

 

ఎంతకి అసలు విషయాన్ని మరచి పదే పదే కశ్మీర్ విషయాన్ని ప్రస్దావించడం పాక్ వక్రబుద్ధికి నిదర్శనంగా నిలిచింది.. అంతే కాకుండా కరోనా అంశాన్ని అడ్డుపెట్టుకొని పాకిస్థాన్ కశ్మీర్‌లోని ఆంక్షలపై ముడిపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఏది ఏమైనా కుక్కతోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది.. అలాగే పాకిస్దాన్ బుద్ధి కూడా అంతే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: