జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు యుద్ధం మొదలైంది. అదికూడా స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో  వివాదం మొదలవ్వటం విచిత్రంగా ఉంది. కరోనా వైరస్ సాకును చూపిస్తు స్దానికసంస్ధల ఎన్నికల ప్రక్రియను మధ్యలో నిలిపేస్తు నిమ్మగడ్డ చేసిన ప్రకటనే వివాదానికి కారణమైంది. అసలు కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరమే లేదని జగన్ ఒక్కసారిగా ఎన్నికల కమీషనర్ ను నేరుగా ఎటాక్ చేయటం సంచలనంగా మారింది.

 

స్ధానిక సంస్దల ఎన్నికల్లో ఏకగ్రీవాలతో వైసిపి దూసుకుపోతోంది. పోటి చేయటానికి నేతలు ముందుకు రాకపోవటంతో చాలా చోట్ల తెలుగుదేశంపార్టీ చేతులెత్తేసింది. ఈ నేపధ్యంలోనే  ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రమేష్ ప్రకటించటంతో జగన్ కు ఒళ్ళు మండిపోయింది. గడచిన పదిమాసాల్లో ఎప్పుడూ మీడియా సమావేశం నిర్వహించని జగన్ ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి నిమ్మగడ్డను వాయించేశాడు. నిమ్మగడ్డ చేసిన ప్రకటన కేవలం చంద్రబాబునాయుడు సూచన ప్రకారమే చేశారని నేరుగానే ఆరోపించాడు. అదికూడా సామాజికవర్గం నేపధ్యంలో ఇద్దరు కుమ్మకై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు ఆరోపించటం మరింత సంచలనంగా మారింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ అని నిమ్మగడ్డ చెప్పటం తప్పని అర్ధమైపోతోంది. ఎలాగంటే ఎన్నికలను వాయిదా వేయాలని అనుకునే ముందు నిమ్మగడ్డ మెడికల్ అండ్ హెల్త్ శాఖ అధికారులతో ఎక్కడా సమావేశం నిర్వహించలేదు. చీఫ్ సెక్రటరితో మాట్లాడలేదు. ముఖ్యమంత్రి ముందు తన ఆలోచనను ఉంచలేదు. పైగా పరిషత్ ఎన్నికల వాయిదా విషయంలో పంచాయితీరాజ్ శాఖతో కానీ మున్సిపల్ ఎన్నికల వాయిదా గురించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖతో కూడా నిమ్మగడ్డ చర్చించలేదు.

 

స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేయాల్సినంత ఆందోళనకర పరిస్ధితులు ఏపిలో లేవన్న విషయం అందరికీ తెలుసు. ఎవరితోను చర్చించకుండానే తన విచక్షణపేరుతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించటంతోనే నిమ్మగడ్డపై ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇంత చేసిన తర్వాత, జగన్ విశ్వాసం కోల్పోయిన అధికారి ఇంకా పదవిలో కంటిన్యు అవుతుండమే ఆశ్చర్యంగా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: