ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించిన విధంగా ముందుకు వెళ్ళింది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవాలు జరగడం, మిగిలిన చోట్ల కూడా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే విధంగా పరిణామాలు చోటుచేసుకోవడం తో వైసీపీలో మొదట్లో జోష్ కనిపించింది. అయితే అకస్మాత్తుగా ఏపీలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఎన్నికలను వాయిదా వేయడానికి కారణంగా కరోనా వైరస్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తావించడంతో ఏపీ అధికార పార్టీని వైసీపీలో మరింత ఆగ్రహాన్ని రాజేసింది.
 
 
 కేవలం తెలుగుదేశం పార్టీకి మేలు చేసే విధంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలి పెట్టకూడదని వైసిపి నిర్ణయించుకుంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారని, ఆయన వ్యవహారశైలిపై వైసిపి మండిపడుతోంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టమని, తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికలు వాయిదా నిర్ణయం తీసుకుంటూ రమేష్ కుమార్ విడుదల చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టులోనే తేలుస్తామని అన్నారు. 
 
 
ఎన్నికల విషయంలో కమిషన్  రాజ్యాంగం ప్రకారం అధికారాలు ఉంటాయని, కానీ వాటిని దుర్వినియోగం చేశారంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ ను ఉద్దేశించి విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయం పై కనీసం సెక్రటరీ చీఫ్ సెక్రటరీని కూడా సంప్రదించలేదని ప్రభుత్వం రాజకీయ పార్టీలతో చర్చించకుండా ఏకపక్షంగా రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోవడం ఏంటని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.  ఈ సందర్భంగా ఆయన పై తీవ్రస్థాయిలో విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. కరోనా వైరస్ కంటే ఈ రమేష్ వైరస్ చాలా ప్రమాదకరమని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నాయకుల మీద కూడా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. చంద్రబాబు కు ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమ్ముడుపోయారని ఆయన మండిపడ్డారు. 
 
 
చంద్రబాబు చెప్పినట్లు గా ఏపీ బిజెపి అధ్యక్షు డు కన్నా నడుచుకోవడం సిగ్గుచేటు అంటూ కన్నా పై విజయసాయి రెడ్డి మండిపడ్డారు.  ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు వైసిపి వెళ్ళబోతుండడంతో అక్కడ ఏ విధమైన తీర్పు వస్తుందనేది అన్ని రాజకీయ పార్టీల్లోనూ,   ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: