వైసీపీ కీలకనేత నగరి ఎమ్మెల్యే రోజా ఎప్పుడూ ఆంధ్ర రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ... ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ ఉంటారు. తనదైన శైలిలో విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఇక తాజాగా మరోసారి తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీ... టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైన వైసీపీ కీలకనేత నగరి ఎమ్మెల్యే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకు... తన మనిషి అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో నాటకాలు ఆడించారు అంటూ విమర్శలు గుప్పించారు వైసిపి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా. 

 

 

 ఎన్నికలు వాయిదా వేసే విషయాన్ని ఎవరితోనూ చర్చించకుండా చివరికి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చించకుండా... ఎన్నికలను వాయిదా వేసి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృశ్య స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నామని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చెబుతున్నప్పటికీ... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసమే ఎన్నికలను వాయిదా వేశారు అన్న విషయం అర్థమవుతుంది అంటూ వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడం ద్వారా... కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన 5000 కోట్ల రూపాయలు రాకుండా... చంద్రబాబు నాయుడు కుట్ర చేశారు అంటూ మండిపడ్డారు రోజా. 

 

 

 అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వాయిదా వేసినప్పటికీ... ఎప్పుడు నిర్వహించిన తమదే విజయమని అంటూ ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికల తో టిడిపి పార్టీ పని అయిపోతుందనీ.. టిడిపిని ఓఎల్ఎక్స్ లో పెట్టుకునే పరిస్థితి వస్తుంది అంటూ జోస్యం చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఐదు వేల కోట్ల రూపాయల నిధులను అడ్డుకున్న చంద్రబాబునాయుడుకు రాష్ట్ర ప్రజలందరూ తగిన బుద్ధి చెబుతారు అంటూ విమర్శించారు వైసీపీ కీలకనేత, నగిరి ఎమ్మెల్యే,  ఏపీఐఐసీ చైర్మన్ రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి: