స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా నేపధ్యంలో  జగన్మోహన్ రెడ్డి-రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మధ్య వివాదం మొదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ వివాదంలో జగన్ వాదనేంటి ? ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ నిర్ణయం కరెక్టేనా ? అని విశ్లేషించాల్సిన ఎల్లోమీడియా జగన్ మాటలను కూడా వక్రీకరిస్తోంది. పైగా జగన్ ఒకటి చెబితే ఎల్లోమీడియా దానికి విరుద్ధంగా అచ్చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ఎన్నికలను సక్రమంగా నిర్వహించటంలో విఫలమయ్యారన్న కారణంతో చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు, ఎస్పీలతో పాటు మరో ఏడుగురు పోలీసు అధికారులను విధుల నుండి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  తప్పించారు. పైగా వాళ్ళపై చర్చలు తీసుకోవాలని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫారసు చేశారు. ఇంత వరకూ బాగానే ఉంది.

 

ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారు కాబట్టి చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ సిఫారసు చేయటాన్ని ప్రస్తావించాడు. వాళ్ళని బాధ్యతల నుండి తప్పిస్తు ఎన్నికల కమీషనర్ నిర్ణయించటంపైన కూడా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ఓ పదిరోజులు ఓపికపడితే ఎన్నికలు అయిపోతాయి కదా అని పట్టించుకోలేదన్నారు. అయితే ఒకవైపు ఎన్నికలను వాయిదా వేసినట్లు చెబుతునే మరోవైపు ఎన్నికల నిర్వహణ బాధ్యతల నుండి అధికారులను తప్పించటాన్ని మాత్రమే తప్పు పట్టాడు.

 

అయితే పచ్చమీడియా మాత్రం దీన్ని వక్రీకరిస్తు జగన్ పై బురద చల్లేస్తోంది. ఎన్నికల కమీషనర్ ఆదేశాలను జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది. అసలు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు అధికారాలే లేవని జగన్ అన్నట్లుగా రాసింది. నిజంగా దీన్ని బురద చల్లటమని కాక మరేమంటారో పచ్చమీడియానే చెప్పాలి. ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్న నిమ్మగడ్డ మళ్ళీ అధికారులను బాధ్యతల నుండి తప్పించటం ఏంటి ? అని మాత్రమే ప్రశ్నించాడు.

 

మీడియాలో జగన్ ఒకటి మాట్లాడితే పచ్చమీడియా మాత్రం మరోటి రాస్తోంది. ఇటువంటి పనికిమాలిన రాతలను నియంత్రించటానికే ప్రభుత్వం ఉత్తర్వులను తెచ్చింది. పైగా సిఎస్ కు సంకటం అంటూ పిచ్చి రాతలు అదనం.  ఏ అధికారిపైనా చర్యలు తీసుకోవద్దని జగన్ ఎక్కడా చెప్పలేదు. జగన్ చెప్పని దాన్ని కూడా చెప్పినట్లు రాసేస్తోంది కాబట్టే దీన్ని పచ్చమీడియా అని జగన్ అంటున్నది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: