ఇప్పుడు ప్రపంచంలో కరోనా పేరు వింటేనే గుండెల్లో వణుకు పుడుతుంది.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారికి 5 వేల మందికి పైగా మృతి చెందారు. లక్షకు పైగా ఈ కరోనా వైరస్ భారిన పడ్డారు.  ఇలా ప్రతిరోజూ కరోనా వైరస్ విస్తరిస్తూ జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  సాధారణంగా దెయ్యం, భూతం అనగానే వెంటన కొత్త కొత్త మాంత్రికులు పుట్టుకు వస్తారు.  మనిషి భయాన్ని క్యాష్ చేసుకుంటూ గల్లీ గల్లీకి బురిడీ బాబాలు పుట్టుకు వస్తుంటారు.  ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ను బూచీగా చూపిస్తూ దొంగ బాబాబలు పుట్టకు వస్తున్నారు. 

 

మేం మంత్రించి ఇచ్చిన తాయెత్తు మీ వద్ద ఉంటే.. కరోనా కాదు దాని జేజమ్మ కూడా మీ దరిచేరదు మీరు ఆరోగ్యంగా ఉంటారు అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు.  ప్రాణాల కన్నా డబ్బు ఎక్కువ కాదు.. దాంతో జనాలు అలాంటి బురిడీ బాబాల ఉచ్చులో పడిపోతున్నారు.  ఓ వైపు కరోనాకు మెడిసెన్ లేదు.. జాగ్రత్తల వల్ల ఇది మన దరిచేరదు అంటూ డాక్లర్లు ఎంత చెబుతున్నా... సెలబ్రటీలు సోషల్ మాద్యమాల్లో సూచనలు ఇస్తున్నా జనాల్లో మాత్రం కరోనా భయం పోవడం లేదు. తాజాగా త్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిందీ ఘటన.

 

చేతికి తాను కట్టే ఒకే ఒక్క తాయెత్తు కరోనాను పరుగులు పెట్టిస్తుందని నగరానికి చెందిన అహ్మద్ సిద్ధిఖీ ఏకంగా బోర్డు పెట్టి మరీ తాయెత్తులు విక్రయిస్తున్నాడు. అమాయక ప్రజలు నిజమేనని నమ్మి చేతికి తాయెత్తులు కట్టించుకుంటున్నారు. 11 రూపాయలేనన్న ధీమాతో ప్రజలు కూడా మాస్కులు మానేసి అటువైపే మొగ్గు చూపుతున్నారు. తక్కువ డబ్బు.. కరోనా రాదు.. ఇంకేముంది దొంగ బాబా వద్దకు క్యూ కట్టడం మొదలు పెట్టారు.  అయితే ఈ విషయం తెలిసి పోలీసులు అహ్మద్ సిద్ధిఖీ  అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: