జనసేన.. పవర్ స్టార్ గా ప్రేక్షకులు పిలుచుకునే పవన్ కల్యాణ్ పెట్టిన పార్టీ ఇది.. పార్టీ పెట్టి ఆరేళ్లయిపోయింది. పెద్దగా సాధించింది ఇప్పటి వరకూ ఏమీ లేదు. జనసేన పార్టీ పెట్టి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా పవన్ స్వరంలో మాత్రం వాడి వేడి ఏమాత్రం తగ్గలేదు. జగన్ సర్కారుపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఇదొక క్రిమినల్‌ ప్రభుత్వం అని, దాడులు చేస్తే బెదిరిపోమని, కేసులు పెడితే భయపడి పారిపోబోమంటూ రెచ్చిపోతున్నారు.

 

 

ఇక తాను ఎవరికీ భయపడనంటున్న పవన్ కల్యాణ్.. తనకు నాకు నిలబడి పోరాడేవాళ్లు కావాలంటున్నారు. జనసేనను విలీనం చేయమని హోంమంత్రి అమిత్‌షా అడిగినా.. తాను తన స్టాండ్‌ తగ్గలేదని.. పార్టీని చంపనని.. ఇది మహా వృక్షమై తీరుతుందని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఏడేళ్లు నిలిచాను.. మరో 70 ఏళ్లు జనసేన నిలబడుతుంది. నా తర్వాత కూడా పార్టీ ఉండాలనేదే తన తపన అంటున్నారు.

 

 

అయితే పవన్ తీరుపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదని, పిరికి స్టార్ అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ విమర్శలు కురిపించారు. ఏపీ ప్రజలు పిరికివాళ్లని ఇప్పుడు పవన్ అంటున్నారని... నిజానికి పవన్ కళ్యాణ్ పిరికి వాడు కనుకే ఎన్నికలు పూర్తి కాగానే బిజెపి పంచన చేరారని విమర్శించారు.ఇప్పుడు ఏపీలో పవన్ అనే పేరు పిరికివాళ్లకు నిక్ నేమ్ అయ్యిందంటున్నారు గుడివాడ అమర్ నాథ్ రెడ్డి.

 

 

అంతే కాదు.. గతంలో బిజెపిపై పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. జగన్ ప్రభుత్వాన్ని క్రిమినల్ అని అనడాన్ని అమర్‌ నాథ్ తీవ్రంగా తప్పుబట్టారు. క్రిమినల్స్ గా జనం చూశారు కనుక పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల ఓడించారని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: