క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరగిపోతున్నాయి. మామూలుగా ఎవరు విచక్షాణాధికారులు ఉపయోగించినా ప్రభుత్వానికో లేకపోతే అధికారపార్టీకో అనుకూలంగానో ఉండటం సహజం.  కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే రాజ్యంగబద్ద సంస్ధలు విచక్షణ పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రధాన ప్రతిపక్షం టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు అనుకూలంగా ఉండటమే విచిత్రంగా ఉంటోంది. దీనిబట్టి ఉపయోగిస్తున్న  విచక్షణాధికారాలు చంద్రబాబుకు మేలు చేయటం కోసమేనా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పది మాసాల్లో రెండుసార్లు విచక్షణాధికారులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొదటిదేమో శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఉపయోగించింది అయితే రెండోదేమో తాజాగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేఫ్ కుమార్ ఉపయోగించింది. రెండుసార్లు కూడా ఇద్దరు విచక్షణాధికారాలను ఉపయోగంచటం ఎంతగా వివాదాస్పదమయ్యాయో, రెండుసార్లూ చంద్రబాబు రక్షణ కోసమే కావటం గమనార్హం. అంటే షరీఫ్ అయినా నిమ్మగడ్డ అయినా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని అర్ధమైపోతోంది.

 

అసెంబ్లీలో ఆమోదం పొందిన సిఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులు శాసనమండలి ముందుకొచ్చాయి. అప్పుడు కూడా నిబంధనలను అడ్డుగోలుగా ఉల్లంఘించటమే కాకుండా కేవలం చంద్రబాబు ఆదేశాల ప్రకారమే మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తనకు లేని అధికారాలను చేతుల్లోకి తీసుకుని విచక్షణ పేరుతో సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ప్రకటించటం ఎంతగా వివాదాస్పదమైందో అందరూ చూసిందే. ఛైర్మన్ చేసిన ప్రకటన చివరకు శాసనమండలి రద్దు నిర్ణయానికే దారితీసింది.

 

ఇపుడు తాజాగా ఎన్నికల కమీషనర్ కూడా మధ్యలో ఉన్న ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసేందుకు తన విచక్షణాధికారాలను వాడుకోవటమే వివాదాస్పదమైంది. నిమ్మగడ్డ కూడా రాష్ట్రంలో  లేని కరోనా బూతాన్ని బూచిగా చూపించి ఎన్నికలను వాయిదా వేయటం కోసం తన విచక్షణను ఉపయోగించినట్లు చెప్పటమే  విచిత్రం. నిజానికి ప్రజారోగ్యం బాధ్యత ప్రభుత్వానిదే కానీ ఎన్నికల కమీషనర్ ది ఎంత మాత్రం కాదు. రేపేదైనా సమస్య వస్తే జనాలకు సమాధానం చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డే కానీ నిమ్మగడ్డ కాదు.

 

ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టేసి సింపిల్ గా కరోనా వైరస్ కారణంగా తన విచక్షణను ఉపయోగించి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు నిమ్మగడ్డ చేసిన ప్రకటనపై ఎంత దుమారం రేగుతోందో అందరూ చూస్తున్నదే. ప్రకటన చేసింది నిమ్మగడ్డే అయినా దీనికి కారణం చంద్రబాబే అనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అంటే చంద్రబాబు కోసమే అప్పుడు  షరీఫ్, ఇప్పుడు నిమ్మగడ్డ పనిచేస్తున్నారన్నదే అందరికీ అర్ధమైపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: