స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన వెనక పెద్ద తంతగమే జరిగినట్లు సమాచారం. ఆదివారం ఉదయం ఎలక్షన్ కమీషనర్ మీడియా సమావేశం ఉంటుందని శనివారం రాత్రమే మీడియాకు సమాచారం అందింది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నకలకు ఆదివారం నోటిఫికేషన్ ప్రకటించాల్సుంది. మీడియా మిత్రులు కూడా నోటిఫికేషన్  వివరాలు చెప్పటానికే ప్రెస్ మీట్ అరేంజ్ చేశారని అనుకున్నారు.

 

శనివారం రాత్రంతా నిమ్మగడ్డ  కమీషన్ లోని తన చాంబర్లోనే  ఉండిపోయారట.  రాత్రి నుండి ఉదయం వరకూ ఫోన్లలో మాట్లాడుతునే ఉన్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను జాయింట్ సెక్రటరీ తీసుకొచ్చి నిమ్మగడ్డతో మాట్లాడుదామని అనుకుంటే ఇపుడు కాదు పొమ్మనారట. పైగా తాను చెప్పేంత వరకూ మీడియాకు పంచాయితీ ఎన్నికల నోటిఫికేష్ వివరాలు రిలీజ్ చేయద్దని కూడా ఆదేశించారని సమాచారం. అదే సమయంలో కమీషన్ లోనే పని చేస్తున్న ఇన్చార్జి కార్యదర్శి సత్య రమేష్ ను నిమ్మగడ్డ తన చాంబర్ కు పిలిపించుకుని మాట్లాడారు.

 

కమీషన్ లోని మిగిలిన ఉన్నతాధికారులను ఎవరినీ తన చాంబర్ లోకి రానివ్వకుండా వీళ్ళెద్దరే చాలా సేపు మాట్లాడుకున్నారట. విచిత్రమేమిటంటే కమీషన్ కు పూర్తిస్ధాయి కార్యదర్శిగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారి రామసుందర్ రెడ్డిని నియమించినా వ్యవహారాలన్నీ సత్య రమేష్ చేతుల మీదగానే నడుస్తోంది. ఇపుడు కూడా నిమ్మగడ్డ ఇన్చార్జితో మాట్లాడారే కానీ పూర్తిస్ధాయి కార్యదర్శితో కాదట. వీళ్ళద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్న తర్వాత సత్య రమేష్ కార్యాలయంలోనే ఓ నోట్ అప్పటికప్పుడు రెడీ అయ్యిందని సమాచారం.

 

అంటే తన కార్యాలయంలో ఏమి జరుగుతున్నదో కూడా కార్యదర్శి రామసుందర్ రెడ్డికి తెలీకుండా నిమ్మగడ్డ జాగ్రత్తలు తీసుకున్న విషయం అర్ధమైపోయింది. సత్య రమేష్ చాంబర్లో రెడీ అయిన నోట్ నే తర్వాత మీడియా సమావేశంలో నిమ్మగడ్డ చదివి వినిపించారు. నిమ్మగడ్డ ప్రకటన వినగానే రామసుందర్ రెడ్డితో పాటు మీడియా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.  సత్య రమేష్ కూడా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడని కమీషన్ వర్గాలు చెబుతున్నాయి. బహుశా అందుకనే తన తర్వాత అధికారి అయిన రామసుందర్ రెడ్డిని కూడా పక్కనపెట్టి ఇన్చార్జి సత్య రమేష్ తోనే నిమ్మగడ్డ మంతనాలు సాగించిన విషయం అర్ధమైపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: