దేశంలో కొంత మంది మనులుషు మానసిక సమస్యతో ఒక్కొసారి ఉన్మాదులుగా మారుతుంటారు.  అప్పటి వరకు మన పక్కనే ఉన్నవారు ఒక్కసారే సైకోలుగా మారి చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు.  కొని సార్లు రాళ్లు విసరడం.. కర్రలతో దాడి చేయడం.. లేదా చేతికి ఏ వస్తువు అందితే దాన్ని విసరడమో కొట్టడమో చేస్తుంటారు.  ఇలాంటి సంఘటనలు జరిగినపుడు జనాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉరుకులు పరుగులు తీస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితి పాలకొల్లులో జరిగింది.. ఓ ఉన్మాది రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లేవారిపై దాడి చేస్తూ భయబ్రాంతులు సృష్టించాడు. తమిళనాడులోనిక తంజావూరుకు చెందిన సులేన్‌ అనే వ్యక్తి స్థానిక యడ్లబజారు ప్రాంతంలో దాదాపు గంటన్నర పాటు సైకోలాగా ప్రవర్తించాడు. 

 

మొదట కనకదుర్గ అమ్మవారి గుడిలోకి భక్తలు నైవేద్యం కోసం క్యూ కట్టిన సమయంలో ఉన్నట్టుండి వాళ్లందరిని దాటుకుంటూ పూజారి వద్దకు వెళ్లి గర్భగుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. దాంతో పూజారి అతన్ని ఆపడంతో వెంటనే ఆయన వద్ద ఉన్న శఠ గోపం, హారతి పల్లాన్ని తీసుకొని అతని తలపై మోదాడు. అమ్మవారి పూజాసామగ్రిని చెల్లాచెదురు చేశాడు. దీంతో భక్తులు బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత ఓ కిల్లీ షాపు వద్దకు వెళ్లి అక్కడ అంతా చిద్రం చేశాడు. అతనిపై చేయి చేసుకున్నాడు.. ఇలా రోడ్డు పై వెళ్లేవారిని కొట్టడం ప్రారంభిచాడు.

 

దాంతో అతన్ని అడ్డుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించగా అతన్ని రక్తం వచ్చేలా కొట్టాడు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తాళ్ళతో కడితే అదీ విడిపించుకొని కానిస్టేబుల్ పై దాడియి యత్నించాడు. కుటుంబ కలహాలు ఉన్నందున మొదటి నుంచి మతిస్థిమితం లేకుండా ఉన్న సులేన్‌కు ఇంటి నుంచి ఫోన్‌ వచ్చిన తర్వాత ఇలా సైకోగా మారాడని తెలుస్తోంది. ఇతడు పండ్ల రసం వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. చికిత్స అనంతరం సులేన్‌ను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పాలకొల్లు టౌన్ సీఐ సీహెచ్‌ ఆంజనేయులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: