మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి  బీజేపీ గూటికి  చేరడం... అంతేకాకుండా జ్యోతిరాదిత్య సింధియా తో పాటు 22 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం తో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కమల్నాథ్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కమల్ నాథ్ అసెంబ్లీ వేదికగా బలపరీక్ష నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే 22 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిన నేపథ్యంలో ముఖ్య మంత్రి కమల్ నాద్  బలపరీక్షలో నెగ్గ ప్రభుత్వాన్ని నిలుపుకుంటారా  అనే ప్రశ్న అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే నేడు అసెంబ్లీలో ముఖ్య మంత్రి కమల్ నాథ్ పరీక్ష నిరూపించాల్సి  ఉంది కానీ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన బల పరీక్ష వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాన్ని స్పీకర్ ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

 

 

 అయితే మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి మధ్య అసెంబ్లీ వాయిదా పడింది. అయితే అంత ముందుగా సభ ప్రారంభం అవ్వగానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా... అసెంబ్లీలో ప్రసంగించారు గవర్నర్ లాల్జీ  టాండన్ . ఈ సందర్భంగా రాజ్యాంగ నియమాలను అందరూ గౌరవించాలని... ఈ రోజే బలపరీక్ష నిర్వహించాలంటూ స్పీకర్ ను  కోరారు గవర్నర్ లాల్జీ టాండన్. అయితే.. స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోకూడదు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాద్  ఈ సందర్భంగా గవర్నర్ కు లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ సభ్యులు కూడా తీవ్రస్థాయిలో నినాదాలు కూడా చేశారు. అయినప్పటికీ గవర్నర్ మాత్రం ఈ రోజు పరీక్ష జరపాలని పట్టుబట్టారు. 

 

 

 దీంతో  సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వైపు బిజెపి సభ్యులు అందరూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ నినాదాలతో హోరెత్తిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సభ్యులందరూ నినాదాలు చేస్తుండగా గవర్నర్ లాల్జీ  టాండన్  అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.ఈ గందరగోళం మధ్య   స్పీకర్ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో స్పీకర్ నిర్ణయమే కీలకంగా మారగా... తమకు బలపరీక్షకు తగిన బలం ఉంది సీఎం కమల్ నాథ్ మాత్రం ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేదానిపై ప్రస్తుతం ఎంతో ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: