కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి వ్యతిరేక స్వరం వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా గతంలో ఎంఐఎం  పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి పౌరసత్వ  సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఇక తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్... పౌరసత్వ  సవరణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేశారు. తాజాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ సర్కార్. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాక్షస ఆనందం పొందుతూ రాష్ట్ర పౌర పౌర చట్టం అమలు చేయాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేశారు.. 

 

 

 అయితే ఇప్పుడు వరకు భిన్న సంస్కృతులకు ఆలవాలమైంది గా ఉన్న తెలంగాణ రాష్ట్రం పౌరసత్వ సవరణ పై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో రోజులుగా వివిధ వర్గాలు నిరసనలు తెలుపుతూ  ఉన్నాయంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోనే కాదు గతంలో పార్లమెంటులో కూడా  తమ నిర్ణయాన్ని తెలిపాము అంటూ కేసీఆర్ అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశంలో ఇప్పటికే ఏడు రాష్ట్రాలు  వ్యతిరేకంగా తీర్మానం చేసేసాయి  అంటూ తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్రంగా తమది  8 వ రాష్ట్రం అంటూ తెలిపారు. 

 

 

 దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో  పౌరసత్వ సవరణ చట్టం పై కేంద్ర ప్రభుత్వం పునః సమీక్షించాలి అంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం సీఎఎ ను  వ్యతిరేకించడం లేదని అన్ని అర్ధం  చేసుకున్న తర్వాత బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అయితే సిఏఏ అనేది  కేవలం హిందూ ముస్లిం సమస్య కాదు అంటూ తెలిపిన కేసీఆర్... పౌరసత్వ సవరణ చట్టం దేశ సమస్య అంటూ చెప్పుకొచ్చారు. అయితే దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు తప్ప వేరే సమస్యలుండవు కేంద్ర ప్రభుత్వం కొంపలు మునిగిపోయినట్లు ప్రవర్తిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు కేసీఆర్. పౌరసత్వ  సవరణ చట్టం వ్యతిరేకంగా నిరసనలు  చేస్తున్న సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని... కానీ కేంద్ర నాయకులు మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అంటూ విమర్శించారు. అసలు దేశానికి పౌరసత్వ సవరణ చట్టం అవసరం లేదు అంటూ తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: